MLA Vs డిప్యూటీ సీఎం.. పిఠాపురంలో స్టిక్కర్ల వార్

by Sathputhe Rajesh |   ( Updated:2024-05-27 16:14:25.0  )
MLA Vs డిప్యూటీ సీఎం..  పిఠాపురంలో స్టిక్కర్ల వార్
X

దిశ, వెబ్‌డెస్క్: ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలకు సమయం దగ్గర పడుతున్న వేళ పిఠాపురంలో స్టిక్కర్ల వార్ కాకరేపుతోంది. ఇక్కడి నుంచి జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ పోటీకి దిగడంతో అందరి దృష్టి పిఠాపురంపైనే ఉంది. అయితే స్థానికంగా కొంత మంది తమ బైక్‌లు, కార్లు, ఆటోలపై మా ఎమ్మెల్యే పవన్ కల్యాణ్ అంటూ రాయించుకుంటున్నారు. పిఠాపురం జనసేన ఎమ్మెల్యే గారి తాలూకా అంటూ రేడియం స్టిక్కర్లు వేసుకుంటున్నారు. వైసీపీ అభిమానులు మాత్రం డిప్యూటీ సీఎం వంగా గీత అంటూ స్టిక్కర్లు వేసుకుంటున్నారు. ఎన్నికల ఫలితాలు రాకముందే పిఠాపురంలో హడావుడి మొదలైందంటూ స్థానికులు చర్చించుకుంటున్నారు. ఎన్నికల ఫలితాలకు ముందే అభిమానం పీక్స్‌కు చేరడంతో మరోసారి పిఠాపురం వార్తల్లో నిలిచినట్లయింది. కూటమి అభ్యర్థిగా పవన్ కల్యాణ్ ఇక్కడి నుంచి బరిలో ఉండగా వైసీపీ నుంచి వంగా గీత పోటీ చేశారు. వంగా గీతను గెలిపిస్తే డిప్యూటీ సీఎం చేస్తానని ప్రచారం చివరి రోజు సీఎం వైఎస్ జగన్ ప్రకటించిన విషయం తెలిసిందే.

Read More...

పవన్‌ కల్యాణ్‌ కల నెరవేరబోతోంది: మాజీ మంత్రి

Advertisement

Next Story