రాసి పెట్టుకోండి.. ఏపీకి మళ్లీ జగనే సీఎం: MLA ఆర్కే కీలక వ్యాఖ్యలు

by Satheesh |   ( Updated:2024-03-12 08:03:34.0  )
రాసి పెట్టుకోండి.. ఏపీకి మళ్లీ జగనే సీఎం: MLA ఆర్కే కీలక వ్యాఖ్యలు
X

దిశ, వెబ్‌డెస్క్: సీఎం జగన్‌పై మంగళగిరి ఎమ్మెల్యే, వైసీపీ సీనియర్ నేత ఆర్కే కీలక వ్యాఖ్యలు చేశారు. ఏపీకి మళ్లీ జగనే సీఎం.. రాసి పెట్టుకోండి అని ధీమా వ్యక్తం చేశారు. మాజీ సీఎం చంద్రబాబు ఒకప్పుడు బీజేపీని తిట్టి.. రాజకీయ అవసరాల కోసం ఇప్పుడు ఢిల్లీ వెళ్లి మళ్లీ వాళ్ల కాళ్లు పట్టుకున్నారని ఎద్దేవా చేశారు. సీఎం అవుతారని కలలు కన్న జనసేన కార్యకర్తలకు పవన్ కల్యాణ్ తీవ్ర అన్యాయం చేశారని మండిపడ్డారు. ఎంతమంది కలిసి వచ్చిన జగన్‌ను చేయలేరిని అన్నారు.

వచ్చే ఎన్నికల్లో మరోసారి వైసీపీ ఘన విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. జగనే మరోసారి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అవుతారని జోస్యం చెప్పారు. కాగా, వచ్చే ఎన్నికల్లో మంగళగిరి టికెట్ కేటాయించకపోవడంతో ఆర్కే వైసీపీకి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. వైసీపీకి గుడ్ బై చెప్పిన ఆర్కే.. వైఎస్ షర్మిల సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. కాంగ్రెస్ జాయిన్ 15 రోజుల్లోపే తిరిగి మళ్లీ వైసీపీ గూటికి చేరారు.

Advertisement

Next Story