- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
రహస్యాలు మాట్లాడుకునేందుకు వేరే ఫోన్, 12 సిమ్‌లు: MLA కోటంరెడ్డి సంచలన వ్యాఖ్యలు
దిశ, వెబ్‌డెస్క్: వైసీపీ నేత, నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. తనపై ఇంటెలిజెన్స్ అధికారులు నిఘా పెట్టారని.. గత 3 నెలల నుండి తన ఫోన్ ట్యాప్ చేస్తున్నారని ఆరోపించారు. ఈ విషయం నాకు ముందే తెలుసని.. రహస్యాలు మాట్లాడుకునేందుకు వేరే ఫోన్, 12 సిమ్‌లు ఉన్నాయన్నారు. ఫేస్ టైమర్, టెలిగ్రాం కాల్స్‌ని మీ పెగాసస్ రికార్డు చేయలేదని కీలక వ్యాఖ్యలు చేశారు. అధికార పార్టీ ఎమ్మెల్యేపై ముగ్గురు అధికారులతో నిఘా అవసరమా? అని ప్రశ్నించారు.
నిఘా కోసం నా నియోజకవర్గంలో ఒక ఐపీఎస్ అధికారిని పెట్టుకోండన్నారు. క్రికెట్ బెట్టింగ్ కేసులప్పుడు కూడా అప్పటి ఎస్పీ కూడా నాపై నిఘా పెట్టారని పేర్కొన్నారు. కాగా, గత కొన్ని రోజులుగా ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి ప్రభుత్వంపై తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. దీంతో సీఎం జగన్ ప్రత్యేక ఎమ్మెల్యే శ్రీధర్‌రెడ్డిని ప్రత్యేకంగా పిలిచి మాట్లాడారు. అయినప్పటికీ కోటంరెడ్డి మళ్లీ బహిరంగానే విమర్శలు చేయడం హాట్ టాపిక్‌గా మారింది.
Also Read..
బ్రేకింగ్: మరో TDP కీలక నేతకు హార్ట్ ఎటాక్.. హుటాహుటిన ఆసుపత్రికి తరలింపు