- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
‘చంద్రబాబు లాంటి దుర్మార్గుడిని నేనింతవరకు చూడలే’.. కరణం బలరాం ఫైర్
దిశ, వెబ్‌డెస్క్: ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల తేదీ సమీపిస్తున్న కొద్ది రాజకీయాలు మరింత హీటెక్కుతున్నాయి. అధికార, ప్రతిపక్ష పార్టీల నేతల మధ్య మాటల తుటాలు పేలుతున్నాయి. నేతల విమర్శలు, సవాళ్ల, కౌంటర్లతో ఎన్నికలకు రెండు నెలల ముందే ఆంధ్రప్రదేశ్‌లో పొలిటికల్ హీట్ రాజుకుంది. ఈ క్రమంలోనే టీడీపీ చీఫ్ చంద్రబాబు వైసీపీ ఎమ్మెల్యే కరణం బలరాంపై తీవ్ర విమర్శలు చేశారు. కరణం బలరాం ఒక దుర్మార్గుడు అని ఇంకొల్లు సభలో బాబు నిప్పులు చెరిగారు. తాజాగా చంద్రబాబు వ్యాఖ్యలకు కరణం బలరాం స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబు నన్ను దుర్మార్గుడిగా అభివర్ణించారు.. ఇంకొల్లు సభలో నాపై అవాకులు, చెవాకులు పేలారు.. కానీ చంద్రబాబు లాంటి నమ్మించి మోసం చేసే దుర్మార్గుడిని నేనింత వరకు చూడలేదని కౌంటర్ ఇచ్చారు.
నీ చరిత్ర ఏందో.. నా చరిత్ర తేల్చుకుందాం రా.. అని సవాల్ విసిరారు. మీరు అయిన రండి.. లేదా మీ ఆఫీస్‌కు నన్ను రమ్మన్నా వస్తానని చాలెంజ్ చేశారు. 2019లో టీడీపీ తరుఫున చీరాల నుండి పోటీ చేస్తానని తాను అడగలేదని స్పష్టం చేశారు. మిమ్మల్ని ఎవరో ఏదో అన్నారనీ.. నన్ను చీరాలకు పంపించారు.. అయినప్పటికీ నా సత్తాతో చీరాలో గెలిచానని చెప్పారు. పార్టీలకతీతంగా చీరాల ప్రజలు నన్ను గెలిపించారని తెలిపారు. చీరాలలో నన్ను గెలిపించే సత్తా చంద్రబాబుకు ఉంటే.. మంగళగిరిలో స్వయంగా ఆయన కొడుకు లోకేష్ మంగళగిరిలో ఎందుకు ఓడిపోయాడని ప్రశ్నించారు.