- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఏ పార్టీ అయిన నాకు ఓకే.. ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి
దిశ వెబ్ డెస్క్: ఈ రోజు వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి రాయదుర్గం లోని తన నివాసంలో మీడియాతో సమావేశం ఏర్పాటు చేసారు. ఈ సమావేశంలో మాట్లాడిన ఆయినా పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాను ఏ పార్టీ నుంచైనా పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు పేర్కొన్నారు. ఇక తాను కళ్యాణదుర్గం అసెంబ్లీ స్థానం నుంచి.. తన కుటుంబం రాయదుర్గం స్థానం నుంచి పోటీ చేస్తున్నట్లు ప్రకటించారు. అలానే తనకు అండగా ఉన్న కార్యకర్తలకు ఆయన ఎల్లప్పుడు అండగా ఉంటానని పేర్కొన్నారు.ఇక సోషల్ మీడియాలో తనకి పలానా పార్టీ నుండి టికెట్ వస్తుందని అభ్యర్థులు తన పైన చేస్తున్న ప్రచారం లో వాస్తవం లేదని మండిపడ్డారు. అలానే తన కార్యకర్తల పైన బెదిరింపుల ధోరణికి పాల్పడితే సహించేది లేదని హెచ్చరించారు. అయితే ఆయన ఏ పార్టీ నుండి పోటీ చేస్తున్నదీ ప్రకటించ లేదు.
కాగా గతంలో ఈయన వైసీపీ అధినేత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి సీఎం జగన్ పైన సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. అలానే గతంలో రాయదుర్గం , కళ్యాణదుర్గం నియోజకవర్గాల నుండి బరిలో ఉంటామని కాపు రామచంద్రారెడ్డి అర్ధాంగి భారతి ప్రకటించిన విషయం సుపరిచితమే. కాగా నిన్న మాజీ మంత్రి, సీడబ్ల్యూసీ సభ్యుడు రఘువీరారెడ్డినితో రామచంద్రారెడ్డి భేటీ అయ్యారు. ఈ నేపథ్యంలో వారిరువురు రెండు గంటల పాటు సుదీర్ఘ మంతనాలు జరిపారు.అయితే మడకశిర మండలం నీలకంఠాపురం లోని రఘువీరా నివాసానికి రామచంద్రారెడ్డి, ఆయన సతీమణి భారతి, కోడలు అలేఖ్యతో కలిసి రావడం గమనార్హం.