- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
మంత్రి రోజా ఆస్తి వివరాలు వైరల్.. బెంజ్‌తో పాటు మొత్తం ఎన్ని కార్లు ఉన్నాయంటే?

దిశ, వెబ్‌డెస్క్: ప్రముఖ సినీ నటీ, ఏపీ మంత్రి ఆర్కే రోజా గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. సినిమాల్లో దాదాపు దశాబ్దకాలం పాటు సినిమాల్లో రాణించిన ఆమె.. ప్రస్తుతం పూర్తిగా రాజకీయాల్లో కొనసాగుతున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రిగా కొనసాగుతున్నారు. మంత్రిగా బాధ్యతలు తీసుకోక ముందు జబర్దస్త్‌లో జడ్జిగా పనిచేసిన ఆమె.. మంత్రిగా ప్రమాణస్వీకారం అనంతరం వైదొలిగారు. ప్రస్తుతం మరోసారి నగరి నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారు. శుక్రవారం నామినేషన్ దాఖలు చేశారు. అఫిడవిట్‌లో మంత్రి పేర్కొన్న ఆస్తుల వివరాలు ఇలా ఉన్నాయి. 2019లో ఆమె ఆస్తులు రూ.9.03 కోట్లు ఉండగా.. ఇప్పుడు రూ.13.07 కోట్లకు పెరిగింది. ఇందులో చరాస్తులు రూ.5.09 కోట్లు, స్థిరాస్తులు రూ.7.08 కోట్లని తెలిపారు. రూ. కోటి విలువైన బెంజ్‌తో పాటు 9 కార్లు ఉన్నాయని వెల్లడించారు. తాను ఇంటర్ వరకు చదివానని చెప్పారు.