ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిచిన దొంగ చంద్రబాబు: మంత్రి రోజా ఫైర్

by Satheesh |   ( Updated:2023-04-29 07:59:28.0  )
ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిచిన దొంగ చంద్రబాబు: మంత్రి రోజా ఫైర్
X

దిశ, వెబ్‌డెస్క్: విజయవాడలో టీడీపీ నిర్వహిస్తోన్న ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలకు వేడుకులకు స్టార్ హీరో రజినీకాంత్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో రజినీ మాట్లాడుతూ ఏపీ మాజీ సీఎం చంద్రబాబుపై ప్రశంసలు కురిపించారు. కాగా, దీనిపై మంత్రి రోజా రియాక్ట్ అయ్యారు. శనివారం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. హీరో రజినీకాంత్ ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాలకు చంద్రబాబు గురించి భజన చేయడానికి వచ్చారా అని నిలదీశారు. స్వయంగా ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాల్లో ఆయనను అవమానపర్చిన చంద్రబాబును పొగడటం విడ్డూరంగా ఉందని అన్నారు. సింహంలా గర్జించే వ్కక్తి ఎన్టీఆర్ అని.. అలాంటి ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిచిన దొంగ చంద్రబాబు అని రోజా తీవ్ర విమర్శలు చేశారు.

Also Read..

బ్రేకింగ్: వైసీపీకి బిగ్ షాక్.. మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి కీలక నిర్ణయం!

Advertisement

Next Story