- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
నీచమైన భాషకు బ్రాండ్ అంబాసిడర్ మంత్రి రోజా: టీడీపీ నేత గౌతు శిరీష
దిశ, డైనమిక్ బ్యూరో: రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి ఆర్‌కే రోజా అంటే నీచమైన భాషకు బ్రాండ్ అంబాసిడర్ అని టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గౌతు శిరీష అన్నారు. రాజకీయాల్లో మహిళలు ఎంతో హుందాగా, ఆదర్శంగా ఉండాలి. కాని రోజా మాత్రం మహిళా అన్న సంగతి మరిచి మాట్లాడుతున్నారు అని మండిపడ్డారు. తెలుగుదేశం, టీడీపీ నాయకుల గురించి మీరు మాట్లాడే మాటలు, హావభావాలు చూస్తుంటే సాటి మహిళగా సిగ్గుపడుతున్నాం అని అన్నారు. జగన్ రెడ్డి ప్రాపకం కోసం, మీకు సీటు కోసం అసభ్యంగా మాట్లాడుతున్నారు అని ధ్వజమెత్తారు. టీడీపీ 175 స్థానాల్లో పోటీ గురించి రోజా నోరుపారేసుకున్నారు అని మండిపడ్డారు. టీడీపీ అంటే క్రమశిక్షణ కలిగిన పార్టీ. మా పార్టీలోనే కార్యకర్త నుంచి నాయకుల వరకు హుందాగా ఉండేటట్టు చంద్రబాబు తీర్చిదిద్దుతారు అని చెప్పుకొచ్చారు. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా 175 నియోజకవర్గాల్లో గెలుపు సాధించే అభ్యర్ధులతో టీడీపీ సిద్దంగా ఉంది అని అన్నారు. వైసీపీ పార్టీలో ఎమ్మెల్యేలే బయటకు వెళ్లిపోతున్నారు. జగన్ రెడ్డి భయంతో ఎమ్మెల్యే అభ్యర్ధులను మారుస్తున్నారు. జగన్ రెడ్డిపై ప్రజా వ్యతిరేకత తీవ్ర స్థాయిలో ఉండటంతో మంత్రి ఆర్‌కే రోజా పిచ్చి పట్టిన్నట్లుగా మాట్లాడుతున్నారు అని ధ్వజమెత్తారు.