AP Politics: జగన్ పై దాడికి కారణం చంద్రబాబు.. రోడ్డెక్కిన మంత్రి ఆర్కే రోజా..

by Indraja |   ( Updated:2024-04-14 08:30:29.0  )
AP Politics: జగన్ పై దాడికి కారణం చంద్రబాబు.. రోడ్డెక్కిన మంత్రి ఆర్కే రోజా..
X

దిశ వెబ్ డెస్క్: ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు వేడెక్కాయి. నిన్న రాత్రి వైసీపీ అధినేత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై దాడి జరిగిన విషయం తెలిసిందే. కాగా జగన్మోహన్ రెడ్డిపై జరిగిన దాడిపై నగరి మంత్రి ఆర్కే ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం జగన్మోహన్ రెడ్డికి ప్రజల్లో పెరుగుతున్న ఆదరణను చూసి ఓర్వలేక టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు జగన్ పై ఈ దాడి చేయించారని ఆరోపించారు.

సీఎంపై జరిగిన దాడిని నిరసిస్తూ పుత్తూరులో రోడ్డుపై మంత్రి రోజా బైఠాయించారు. సీఎం జగన్ పై దాడి పవన్, చంద్రబాబు కుట్ర అని మండిపడ్డారు. ఈ విషయంలో వెంటనే ఎన్నికల సంఘం స్పందించాలని, పవన్ చంద్రబాబుపై చర్యలు తీసుకోవాలని కోరారు. వెంటనే చంద్రబాబును అరెస్ట్ చెయ్యాలని, అలానే ఈ దాడి వెనక ఎవరెవరు ఉన్నారో పోలీసులు తేల్చాలని డిమాండ్ చేశారు.

Advertisement

Next Story
null