- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
దటీజ్ ‘రజని’.. పశ్చిమలో పట్టు సాధించేందుకు మంత్రి యాక్షన్ స్టార్ట్..!
గుంటూరు పశ్చిమ నియోజకవర్గం వైఎస్సార్‌సీపీలో అంతర్గత విభేదాలు పొడచూపాయా..? పశ్చిమ నియోజకవర్గ ఇన్చార్జిగా విడదల రజని బాధ్యతలు చేపట్టాక పూర్తిగా తన ఆదిపత్యం సాధించేందుకు పావులు కదుపుతున్నారా..? పైకి అందరూ నవ్వుతూనే ఉన్నా.. అంతర్గతంగా నాయకులు పైచేయి సాధించేందుకు ఎత్తుగడలు వేస్తున్నారా..? అంటే ప్రస్తుత పరిణామాలు చూస్తుంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో సీఐల బదిలీల వ్యవహారంలో మంత్రిపై చేయి చూపుతున్నట్లు తెలుస్తోంది.
దిశ ప్రతినిధి, గుంటూరు: రాష్ట్రంలో మరి కొద్ది నెలల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో వైఎస్సార్‌సీపీ నియోజకవర్గ ఇన్చార్జులను మారుస్తూ వస్తోంది. తొలి విడతలో చిలకలూరిపేట ఎమ్మెల్యేగా ఉన్న విడదల రజనిని గుంటూరు పశ్చిమ ఇన్చార్జిగా మార్చింది. వైద్య ఆరోగ్యశాఖ మంత్రిగా ఉన్న విడదల రజని గుంటూరు పశ్చిమ ఇన్చార్జిగా బాధ్యతలు చేపట్టాక చురుగ్గా పార్టీ కార్యక్రమాలు చేపడుతున్నారు. గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యేగా ఉన్న మద్దాళి గిరిధర్ కూడా ఆమెకు పూర్తి సహకారం అందిస్తున్నారు. ఈయనతో పాటు ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి కూడా గుంటూరులో పార్టీ బాధ్యతలు చూస్తున్నారు. ఈ ముగ్గురు నేతలు బయటకు ఒక్కటిగానే కనిపిస్తున్నా అంతర్గతంగా ఒకరిపై ఒకరు పై చేయి సాధించేందుకు ఎత్తులు వేస్తున్నట్లు తెలుస్తోంది.
సీఐల మార్పుతో బహిర్గతం
విడదల రజని పశ్చిమ ఇన్చార్జిగా భాధ్యతలు స్వీకరించిన తరువాత నియోజకవర్గంలో తన పట్టు కోసం ప్రయత్నాలు ప్రారంభించారు. ఈ నేపథ్యంలో ప్రధానంగా పోలీసు విభాగంలో తనకు అనుకూలమైన వారిని తీసుకురావాలనుకున్నారు. ఈ క్రమంలో ప్రారంభానికి ముందు రోజు పార్టీ కార్యాలయంపై దాడులు జరిగాయి. దీంతో స్థానికంగా ఉన్న సీఐలను మార్చి తన వారిని తెప్పించేందుకు రంగం సిద్ధం చేశారు. పశ్చిమలో అరండల్ పేట, నగరంపాలెం, పట్టాభిపురం పోలీస్ స్టేషన్లు ఉన్నాయి. ఆయా స్టేషన్లకు ఎమ్మెల్యే మద్దాళి గిరి, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి రాజకీయ అండతో సీఐలు వచ్చేవారు. ఈ క్రమంలో కొద్ది నెలల క్రితం నగరంపాలెం సీఐగా మల్లికార్జున, అరండల్ పేట సీఐగా వెంకటేశ్వర రెడ్డి, పట్టాభిపురం సీఐగా వీరేంద్ర వచ్చారు. వీరు లేళ్ల అప్పిరెడ్డి ద్వారా వచ్చినట్లు సమాచారం. అయితే రజని బాధ్యతలు చేపట్టిన అతి తక్కువ కాలంలోనే నగరంపాలెం సీఐ మల్లికార్జున స్థానంలో నరేష్ కుమార్ వచ్చారు. త్వరలో పట్టాభిపురం, అరండల్ పేట సీఐలను కూడా మార్చనున్నట్లు తెలిసింది.
రజని, లేళ్ల మధ్య భేదాభిప్రాయాలు
పశ్చిమలో సీఐల బదిలీ వ్యవహారంలో మంత్రి విడదల రజని, లేళ్ల మధ్య భేదాభిప్రాయాలు వచ్చినట్లు పార్టీ వర్గాలే చెప్పుకుంటున్నాయి. అయితే సీఐల బదిలీ వ్యవహారంలో లేళ్ల మౌనంగా ఉంటారా ? లేక అడ్డుకుంటారా? అని వైసీపీ వర్గాలు చర్చించుకుంటున్నాయి. మరి గుంటూరు పశ్చిమలో ఎవరిది పై చేయి కానుందో చూడాలి.