Ap Pensions: ఆగస్ట్ నెల పింఛన్ల పంపిణీపై మంత్రి పార్థసారథి కీలక ప్రకటన

by srinivas |   ( Updated:2024-07-31 10:45:27.0  )
Ap Pensions: ఆగస్ట్ నెల పింఛన్ల పంపిణీపై మంత్రి పార్థసారథి కీలక ప్రకటన
X

దిశ, వెబ్ డెస్క్: ఏపీలో ఆగస్టు 1 (గురువారం)నే పింఛన్లు పంపిణీ చేస్తామని మంత్రి పార్థసారథి స్పష్టం చేశారు. సచివాలయంలో ఆయన మాట్లాడుతూ పింఛన్ల పంపిణీకి సర్వం సిద్ధం చేశామని ఆయన తెలిపారు. ఇప్పటికే ప్రభుత్వం నిధులు విడుదల చేసిందని చెప్పారు. ఆరోగ్య శ్రీపై కొందరు దుష్ప్రచారం చేస్తున్నారని మంత్రి మండిపడ్డారు. ఆరోగ్య శ్రీ బకాయిలను గత ప్రభుత్వం చెల్లించలేదని, దాని వల్ల చాలా ఆస్పత్రులు ఆ సేవలను నిలిపివేశాయన్నారు. పేదలకు వైద్యం అందకపోవడానికి వైఎస్ జగనే కారణమని చెప్పారు. జగన్ ప్రభుత్వం చేతకాని తనం వల్లే ఏపీ అప్పుల్లో కూరుపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజల ఆరోగ్యాన్ని కాపాడే బాధ్యత కూటమి ప్రభుత్వం తీసుకుంటుందన్నారు. జగన్‌కు దమ్ముంటే అసెంబ్లీకి వచ్చి ప్రజా సమస్యలపై పోరాటం చేయాలని మంత్రి పార్థసారిథి సవాల్ చేశారు.

.‘వైసీపీ నేతలు చేసిన ఆర్థిక అవకతవకల మూలంగా.. రాష్ట్రాన్ని ఆర్థికంగా కుదేలు చేయడం వలన ఆఖరికి భోజనాలు సరఫరా చేసే వారికి కూడా బిల్లులు ఇవ్వలేని దుస్థితి ఉంది. ప్రభుత్వంపై గోబెల్స్, అబద్దాలు ప్రచారం చేయడం మాని అసెంబ్లీకి వచ్చి వైసీపీ నేతలు చేసిన మేలు ఏదైనా ఉంటే చెప్పుకోవాలి.’ అని మంత్రి పార్థసారథి సూచించారు.

Advertisement

Next Story

Most Viewed