ఓడిన చోటే రికార్డు మెజారిటీతో.. మంత్రి నారా లోకేష్ భావోద్వేగ ట్వీట్

by Sathputhe Rajesh |   ( Updated:2024-06-21 15:03:51.0  )
ఓడిన చోటే రికార్డు మెజారిటీతో.. మంత్రి నారా లోకేష్ భావోద్వేగ ట్వీట్
X

దిశ, వెబ్‌డెస్క్: ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత నారా లోకేష్ ట్విట్టర్ వేదికగా భావోద్వేగ ట్వీట్ చేశారు. ‘మంగళగిరి నియోజకవర్గ ప్రజల ఆశీస్సులతో ఈ రోజు తొలిసారి అసెంబ్లీలో అడుగుపెట్టిన నేను.. శాసనసభ్యుడిగా ప్రమాణం చేయడం నా జీవితంలో మరుపురాని ఘట్టం. అయిదేళ్ల క్రితం ఓడిన చోటే రికార్డు స్థాయి మెజారిటీతో గెలిపించి అసెంబ్లీకి పంపిన మంగళగిరి ప్రజలకు జీవితాంతం రుణపడి ఉంటాను. ప్రజలు నాపై ఎంతో నమ్మకంతో ఇచ్చిన ఈ అవకాశాన్ని వారి సంక్షేమం, అభివృద్ధి కోసమే వినియోగిస్తాను. రాష్ట్రంలో కూటమి నేతృత్వంలో కొలువైన ప్రజా ప్రభుత్వం 5 కోట్ల మంది ప్రజల ఆశలు, ఆకాంక్షల మేరకు పనిచేస్తుంది.’ అని లోకేష్ ట్వీట్ చేశారు. ఈ ట్వీట్‌కు ప్రమాణ స్వీకారం అనంతరం చంద్రబాబు, బాలకృష్ణ ఆశీర్వాదం తీసుకుంటున్న ఫొటోలతో పాటు పవన్ కల్యాణ్‌కు అభివాదం చేస్తున్న ఫొటోలను లోకేష్ పంచుకున్నారు.

Advertisement

Next Story