‘త్వరలో భూ అక్రమాల వివరాల ప్రకటన’..మంత్రి లోకేష్ సెన్సేషనల్ కామెంట్స్!

by Jakkula Mamatha |   ( Updated:2024-08-29 13:26:05.0  )
‘త్వరలో భూ అక్రమాల వివరాల ప్రకటన’..మంత్రి లోకేష్ సెన్సేషనల్ కామెంట్స్!
X

దిశ,వెబ్‌డెస్క్:గత వైసీపీ ప్రభుత్వ హయాంలో రాష్ట్ర వ్యాప్తంగా భూ అక్రమాలు జరిగాయని మంత్రి లోకేష్ అన్నారు. తాజాగా మంత్రి లోకేష్ మీడియాతో మాట్లాడుతూ గత వైసీపీ ప్రభుత్వం పై నిప్పులు చెరిగారు. టీడీపీ కూటమి ఎన్నికల సమయంలో ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలకు కట్టుబడి ఉందని తెలిపారు. సీఎం చంద్రబాబు హామీలపై ప్రత్యేక ఫోకస్ పెట్టారు అని అన్నారు. అయితే రాష్ట్రం గత ప్రభుత్వ పాలన వల్ల చాలా నష్టపోయింది అని మంత్రి లోకేష్ విమర్శించారు. భూ అక్రమాలకు అడ్డు అదుపు లేకుండా పోయిందన్నారు. ఎక్కడ ఎన్ని ఎకరాల అక్రమాలు జరిగాయో త్వరలో వెల్లడిస్తామన్నారు. గత ప్రభుత్వ వైఖరి వల్ల రాష్ట్రం నుంచి పెట్టుబడులు ఇతర రాష్ట్రాలకు వెళ్లాయని సూచించారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సీఎం అయ్యాక పారిశ్రామిక వేత్తలు మళ్లీ రాష్ట్రానికి వస్తున్నారని తెలిపారు. ప్రజలకు ఇచ్చిన హామీలకు కట్టుబడి ఉన్నాం అని మీడియాతో వ్యాఖ్యానించారు.

Advertisement

Next Story