Nara Lokesh:ఉపాధ్యాయులకు గుడ్ న్యూస్..మంత్రి లోకేష్ కీలక నిర్ణయం

by Jakkula Mamatha |
Nara Lokesh:ఉపాధ్యాయులకు గుడ్ న్యూస్..మంత్రి లోకేష్ కీలక నిర్ణయం
X

దిశ,వెబ్‌డెస్క్: ఏపీలో టీడీపీ కూటమి ప్రభుత్వం ప్రజా సంక్షేమం దిశగా అడుగులు వేస్తోంది. ఈ క్రమంలో మంత్రి నారా లోకేష్ ఉపాధ్యాయులకు శుభవార్త చెప్పారు. ప్రభుత్వ ఉపాధ్యాయులు పాఠశాలల్లోని మరుగుదొడ్లను ఫొటోలు తీసి అప్‌లోడ్ చేసే విధానాన్ని పాఠశాల విద్యాశాఖ నిలిపివేసింది. ఈ క్రమంలో ఇకపై ఉదయాన్నే పాఠశాలలో మరుగుదొడ్ల ఫొటోలు తీసి అప్‌లోడ్ చేయాల్సిన పని ఉపాధ్యాయులకు లేదని ఏపీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తెలిపారు. ఈ మేరకు ఐఎంఎంఎస్ యాప్‌లో ఈ ఆప్షన్‌ను సైతం తాత్కాలికంగా తొలగించింది. ఈ విధానాన్ని ఆపేశామని..యాప్ నుంచి ఆ ఆప్షన్‌ను కూడా తొలగించామని చెప్పారు. ఆ బాధ్యతలను ఇతర విభాగాలకు అప్పగించాలని ప్రభుత్వం భావిస్తోంది. కాగా ప్రస్తుతం రోజుకో ఉపాధ్యాయుడు ఫొటోలు తీసి అప్‌లోడ్ చేస్తున్నారు. గత ప్రభుత్వం తెచ్చిన ఈ విధానం పై ఉపాధ్యాయ వర్గాల నుంచి విమర్శలు వ్యక్తమయ్యాయి. ఉపాధ్యాయులు నాణ్యమైన విద్యను పిల్లలకు అందించాలని మంత్రి లోకేష్ సూచించారు. క్రమశిక్షణ, ఉన్నత విలువలతో విద్యార్థులను తీర్చిదిద్దాలని ట్విట్టర్ వేదికగా మంత్రి లోకేష్ తెలిపారు.

Advertisement

Next Story