- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
జోగి రాజీవ్ అక్రమాలపై మంత్రి లోకేశ్ తీవ్ర ఆగ్రహం.. శిక్ష తప్పదని వార్నింగ్
దిశ, వెబ్ డెస్క్: అగ్రిగోల్డ్ భూముల వ్యవహారంలో మాజీ మంత్రి జోగి రమేశ్ తనయుడు రాజీవ్‌ను అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. అయితే జోగి రాజీవ్ అరెస్ట్‌తో ప్రభుత్వంపై తండ్రి రమేశ్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. మంత్రి లోకేశ్ రెడ్ బుక్ రాజ్యాంగంలో భాగంగానే తన కుమారుడు రాజీవ్‌ను అరెస్ట్ చేశారని జోగి రమేశ్ ఆరోపించారు. ఈ వ్యాఖ్యలపై మంత్రి నారా లోకేశ్ స్పందించారు. మంగళగిరి నియోజకవర్గం తాడేపల్లి మండలం నులకపేటలో అన్న క్యాంటీన్లు ప్రారంభించిన ఆయన మాజీ మంత్రి జోగి రమేశ్, తనయుడు రాజీవ్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. జోగి రాజీవ్ నకిలీ పత్రాలతో అగ్రిగోల్డ్ భూములు అమ్ముకున్నారని, అలాంటి వారిని వదిలిపెట్టాలా అని మండిపడ్డారు. ప్రజలకు చెందాల్సిన భూములను అక్రమంగా అమ్ముకున్నారని ధ్వజమెత్తారు. చట్టాలను ఉలంఘించిన వారిపై చర్యలు తప్పవని హెచ్చరించారు. తప్పు చేసిన వ్యక్తులు జైలుకు వెళ్లాల్సిందేనన్నారు. అవినీతికి పాల్పడితే ఎవరినీ వదిలిపెట్టమని నారా లోకేశ్ వార్నింగ్ ఇచ్చారు.