Breaking: చంద్రబాబు అలా చేయడం వల్లే ఏపీకి రాజధాని లేదు..బొత్స

by Indraja |
Breaking: చంద్రబాబు అలా చేయడం వల్లే ఏపీకి రాజధాని లేదు..బొత్స
X

దిశ డైనమిక్ బ్యూరో: ఈ రోజు మంత్రి బొత్స సత్యనారాయణ మీడియా సమావేశంలో పాల్గొన్నారు. ఈ నేపద్యంలో ఆయన మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు. తమ నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఒకటే చెప్తున్నారని.. తాము మంచి చేశామని ప్రజలు భావిస్తే మరో అవకాశం ఇవ్వమని అడుగుతున్నారని పేర్కొన్నారు. అలా అడగడంలో తప్పేముంది అని ప్రశ్నంచారు. ఇక రాజధాని విషయంలో తమ పార్టీ విధానం ఎప్పుడో చేప్పామని.. చెప్పినదానికే కట్టుబడి ఉన్నామని పేర్కొన్నారు.

అలనే హైదరాబాద్‌ విశ్వనగరమని.. అదేం ప్రశాంత్‌రెడ్డి ఆస్తి​ కాదని.. అక్కడ ఎవరికైనా ఆస్తులు ఉండొచ్చని ఎద్దేవ చేశారు. ఇక ఆనాడు చంద్రబాబు అర్ధరాత్రి పారిపోయి వచ్చారు అందుకే నేడు ఆంధ్రప్రదేశ్ కి రాజధాని లేని దుస్థితి దాపరించిందని ఆరోపించారు. తమ పార్టీ స్టాండ్ ఎప్పుడు కూడా విభజన హామీలు సాధించడమేనని పేర్కొన్నారు. తాము ప్రజలు ఏం మేలు చేసామో చెప్పే ఓట్లు అడుగుతున్నామని.. తమకి ఎలాంటి జిమ్మిక్కులు మాకు అవసరం లేదు అని స్పష్టం చేశారు.

తెలుగుదేశం, జనసేన అధినేతలకు ఆంధ్రప్రదేశ్ లో సొంత ఇల్లు లేదు కానీ ఇక్కడ రాజకీయాలు కావాలి ’’ అని మంత్రి బొత్స దుయ్యబట్టారు. ఇక పెండింగులో ఉన్న బకాయిల గురించి ఉద్యోగులతో ఆల్రెడీ చర్చలు జరిపామని తెలిపిన ఆయన.. పెండింగులో ఉన్న బకాయిలు వచ్చే నెలలో ఇస్తాం అని చెప్పామని మంత్రి బొత్స వెల్లడించారు.

Advertisement

Next Story