- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
స్టీల్‌ప్లాంట్‌పై హరీశ్‌రావువి చిన్న పిల్లల మాటలు.. తప్పుబట్టిన మంత్రి బొత్స
దిశ, వెబ్ డెస్క్: స్టీల్ ప్లాంట్‌పై బీఆర్ఎస్ నేతల వ్యాఖ్యలను మంత్రి బొత్స సత్యనారాయణ తప్పుబట్టారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై సీఎం కేసీఆర్ ఎప్పుడు మాట్లాడారు..? అని ప్రశ్నించారు. తెలంగాణ మంత్రి హరీశ్ రావు మాటలు చిన్న పిల్లల మాటలని కొట్టిపారేశారు. పక్క రాష్ట్రం గురించి మాట్లాడే హక్కు వాళ్లకేం ఉందని నిలదీశారు. ఎవరి పరిధిలో వాళ్లు మాట్లాడితే మంచిదని బొత్స హెచ్చరించారు.
కాగా విశాఖ స్టీల్ ప్లాంట్‌పై పొలిటికల్ రగడ కొనసాగుతోంది. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరించొద్దని ఇటీవల నుంచి బీఆర్ఎస్ డిమాండ్ చేస్తోంది. ఈ మేరకు స్టీల్ ప్లాంట్‌లో బిడ్ కూడా దాఖలు చేసింది. అంతేకాదు తెలంగాణ నుంచి ప్రత్యేక బృందం విశాఖ స్టీల్ ప్లాంట్ వెళ్లి అధికారులతో చర్చలు జరిపారు. ఇదిలా ఉంటే తాజాగా స్టీల్ ప్లాంట్‌పై కేంద్రమంత్రి సంచలన ప్రకటన చేశారు. స్టీల్ ప్లాంట్‌ను ప్రైవేటీకరించడంలేదని స్పష్టం చేశారు. దీంతో ఆ క్రెడిట్ తమదేనని బీఆర్ఎస్ మంత్రులు కేటీఆర్, హరీశ్ రావు వ్యాఖ్యానించారు. స్టీల్ ప్లాంట్ వైసీపీ, టీడీపీ పోరాటం చేయలేదని విమర్శించారు. దీంతో వైసీపీ, బీఆర్ఎస్ నేతల మధ్య మాటల యుద్ధం మరింత ముదిరింది.