పవర్ స్టార్ ట్యాగ్ ఓకే.. పవర్ షేరింగ్ పరిస్థితేంటి?

by GSrikanth |
పవర్ స్టార్ ట్యాగ్ ఓకే.. పవర్ షేరింగ్ పరిస్థితేంటి?
X

దిశ, వెబ్‌డెస్క్: ఏపీలోని టీడీపీ-జనసేన కూటమిపై మంత్రి అంబటి రాంబాబు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. గురువారం మంత్రి మీడియాతో మాట్లాడుతూ.. కూటమి ఆధ్వర్యంలో బుధవారం తాడేపల్లిగూడెంలో నిర్వహించిన సభ ఫెయిల్ అయ్యిందని విమర్శించారు. సభలో జనం లేకపోవడంతో నాయకులు అసహనానికి గురై ప్రభుత్వంపై విమర్శలు చేశారని అన్నారు.

అసలు తాడేపల్లి సభ ద్వారా చంద్రబాబు, పవన్ కల్యాణ్ ప్రజలకు ఏం సందేశం ఇచ్చారని ప్రశ్నించారు. చంద్రబాబు ఎప్పటిలాగే రొటీన్ డైలాగులు పేల్చారు కానీ, పవన్ కల్యాణ్‌కు న్యాయం చేయలేదని ఎద్దేవా చేశారు. పవర్ స్టార్.. పవర్ స్టార్ అని అరవడమే కానీ, పవర్ షేరింగ్ గురించి మాట్లాడలేదని విమర్శించారు. కనీసం మచ్చుకైనా జనసేనకు అధికారంలో కూడా వాటా ఉంటుందని చంద్రబాబు చెప్పలేదని అన్నారు. ఇప్పటికైనా జనసైనికులు కళ్లు తెరవాలని సూచించారు. మోసపోవద్దని హితవు పలికారు.

Advertisement

Next Story