- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
Ap News: పవన్ కల్యాణ్‌పై మంత్రి సురేశ్ ఘాటు వ్యాఖ్యలు
దిశ, డైనమిక్ బ్యూరో: జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై మంత్రి ఆదిమూలపు సురేశ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. పవన్ కల్యాణ్ ఒక రాజకీయ వ్యభిచారి అని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఒక వైపు బీజేపీతో ఉంటూ మరోవైపు టీడీపీతో కలిసి పని చేస్తున్నాడని ఆరోపించారు. వచ్చే ఎన్నికల్లో ఏ పార్టీతో పొత్తు పెట్టుకుంటాడో, ఎన్ని స్థానాల్లో పోటీ చేస్తాడో పవన్ కల్యాణ్‌కే తెలియదని విమర్శించారు.
మరోవైపు టీడీపీపైనా మంత్రి తీవ్ర విమర్శలు చేశారు. నాలుగు ఎమ్మెల్సీలు గెలుపొందితే ఏదో సాధించేశామనే భ్రమలో టీడీపీ నేతలు ఉన్నారని... వాపుని చూసి బలుపు అనుకుంటున్నారని ఎద్దేవా చేశారు. టీడీపీకి 175 నియోజకవర్గాల్లో పోటీ చేసేందుకు అభ్యర్థులే లేరని విమర్శించారు. ఇకపోతే రాష్ట్రంలో ముందస్తు ఎన్నికలు వచ్చే అవకాశం లేదన్నారు. ఈ అంశంపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ క్లారిటీ ఇచ్చారన్నారు. టీడీపీ హయాంలో రూ. 300 కోట్ల సీమెన్స్ స్కామ్ జరిగిందని.. ఈ స్కాం విషయంలో చట్టం తన పని తాను చేసుకుపోతుందని మంత్రి ఆదిమూలపు సురేశ్ వెల్లడించారు