రైతులకు అదిరిపోయే న్యూస్.. 43,402 కోట్లతో వ్యవసాయ బడ్జెట్‌ను ప్రవేశ పెట్టిన మంత్రి అచ్చెన్నాయుడు

by Mahesh |   ( Updated:2024-11-11 07:38:10.0  )
రైతులకు అదిరిపోయే న్యూస్.. 43,402 కోట్లతో వ్యవసాయ బడ్జెట్‌ను ప్రవేశ పెట్టిన మంత్రి అచ్చెన్నాయుడు
X

దిశ, వెబ్ డెస్క్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం అయ్యాయి. ఈ సందర్భంగా ఆర్దిక మంత్రి పయ్యావుల కేశవ్ మొదట అసెంబ్లీలో 2024-2025 ఆర్ధిక సంవత్సరానికి సంబంధించి 2.94 లక్షల కోట్ల బడ్జెట్‌ను ప్రవేశ పెట్టారు. రెవెన్యూ వ్యయం(Revenue Expenditure) అంచనా రూ.2.34లక్షల కోట్లు, రెవెన్యూ లోటు రూ.34,743 కోట్లు, ద్రవ్యలోటు రూ.68,743 కోట్లుగా ప్రతిపాదించారు. అనంతరం రాష్ట్ర వ్యవసాయ, పశుసంవర్దక శాఖ మంత్రి అచ్చెన్నాయుడు అసెంబ్లీలోనే రూ. 43,402 కోట్ల వ్యవసాయ శాఖ బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా మంత్రి వ్యవసాయ బడ్జెట్ ప్రతులను చదివి వినిపించారు. గత ప్రభుత్వం రైతులకు పంటల బీమా అందించలేదని గుర్తు చేశారు. రాష్ట్రంలోని ప్రతి రైతుకు వడ్డీలేని రుణాలు, భూసార పరీక్షలకు ప్రాధాన్యత ఇస్తామని ఈ సందర్భంగా మంత్రి అచ్చెన్నాయుడు చెప్పుకొచ్చారు. అలాగే వ్యవసాయ రంగం ద్వారా రైతులను అన్ని విధాలా ఆదుకొని నిధులు కేటాయించామని చెప్పుకొచ్చారు. ఏపీ ఆర్థిక వ్యవస్థకు వ్యవసాయం వెన్నెముక అని, గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి కోసం వ్యవసాయానికి నిర్దిష్టమైన ప్రణాళిక అవసరమని అన్నారు. తాము స్వర్ణాంధ్ర 2047 లక్ష్యంగా పనిచేస్తున్నామని, వ్యవసాయం ఆధారంగా 62 శాతం జనాభా జీవిస్తున్నారని చెప్పుకొచ్చారు.

  1. వ్యవసాయ శాఖ - రూ.8,564.37 కోట్లు
  2. అన్నదాత సుఖీభవ కార్యక్రమానికి రూ.4,500 కోట్లు
  3. పంటల బీమాకు 1023
  4. వడ్డీలేని రుణాలకు రూ. 628 కోట్లు
  5. వ్యవసాయ మార్కెటింగ్ కు రూ.312 కోట్లు
  6. ఎన్జీ రంగా యూనివర్సిటీ - రూ.507.3 కోట్ల
  7. విత్తనాల పంపిణీ రూ. 240 కోట్
  8. భూసార పరీక్షలు రూ. 38.88 కోట్లు
  9. పట్టు పరిశ్రమకు రూ. 108.44 కోట్లు
  10. ఎరువుల పంపిణీ రూ. 40 కోట్లు
  11. ఇంటిగ్రేటెడ్ అగ్రి ల్యాబ్స్ రూ.44.03 కోట్లు
  12. పొలం పిలుస్తోంది కార్యక్రమానికి రూ. 11.31 కోట్లు
  13. ఇంటిగ్రేటెడ్ అగ్రి ల్యాబ్స్ రూ.44.03 కోట్లు
  14. రైతు సేవా కేంద్రాలకు రూ. 26.92 కోట్లు
  15. ఉద్యానవన శాఖ రూ. 3469 కోట్లు
  16. సహకార శాఖ రూ.308.26 కోట్లు
  17. డిజిటల్‌ వ్యవసాయం - రూ.44.77 కోట్లు
Advertisement

Next Story