- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
AP News:వైఎస్ షర్మిలపై మంత్రి అచ్చెన్నాయుడు ఫైర్!
దిశ ఏపీ బ్యూరో,అమరావతి:విత్తనాల కొరతతో కూటమి ప్రభుత్వం రాష్ట్ర రైతాంగం ఆశలను ఆవిరి చేసిందని ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల చేసిన ఆరోపణలపై రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు మండిపడ్డారు. రైతులను మోసం చేయడానికి, మభ్య పెట్టడానికి ఇది మీ అన్నగారి పాలన కాదంటూ మంత్రి అచ్చెన్నాయుడు ఏపీసీసీ చీఫ్ షర్మిలకు శుక్రవారం ఎక్స్ వేదికగా కౌంటర్ ఇచ్చారు. రాష్ట్రంలో ఎక్కడా విత్తనాల కొరత లేదు. రైతుల ప్రయోజనం కోసం ఎటువంటి చర్యలకైనా ఎన్డీయే ప్రభుత్వం కట్టుబడి ఉంది. సంక్షోభం నుంచి సంక్షేమం దిశగా అడుగులు పడుతున్న రాష్ట్రంలో రైతులను అనవసర భయాలకు గురి చేయకండి షర్మిల గారు అని ఆయన అన్నారు.
రాష్ట్రంలో ఖరీఫ్‌లో ఇప్పటికే 5.1 లక్షల క్వింటాళ్ల విత్తనాలు రైతులకు అందించాము. ఇంకా విత్తన పంపిణీ కొనసాగుతోంది. పల్నాడు జిల్లాకు తెలంగాణ నుంచి ఒక ప్రైవేటు వ్యాపారి తెచ్చి విక్రయిస్తున్న ఒక రకం విత్తనం కోసం కొందరు రైతులు పోటీ పడ్డారు. జెజిఎల్ - 384 రకం కంటే మేలైన రకం విత్తనాలను దాదాపు 15 వేల క్వింటాళ్లు సిద్ధంగా ఉంచాము. రైతులకు ఈ అంశంపై అవగాహన కల్పించాము. అధిక వర్షాలతో నష్టపోయిన రైతులకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు గారి నాయకత్వంలో 80% రాయితీపై విత్తనాలు అందించిన ఘనత ఎన్డీయే ప్రభుత్వానిది. అంటూ ఎక్స్‌లో మంత్రి అచ్చెన్నాయుడు ఏపీసీసీ చీఫ్ షర్మిలకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు.