weather Report: గుడ్ న్యూస్ చెప్పిన వాతావరణ కేంద్రం.. రాష్ట్రంలో భారీ వర్షాలు

by Disha Web Desk 3 |
weather Report: గుడ్ న్యూస్ చెప్పిన వాతావరణ కేంద్రం.. రాష్ట్రంలో భారీ వర్షాలు
X

దిశ, ప్రతినిధి, విజయవాడ: ఆంధ్రప్రదేశ్‌లో ఎండలు మండిపోతున్నాయి. ఎండ తీవ్రతకు విలవిలలాడుతున్న ఏపీ ప్రజలకు అమరావతి వాతావరణ కేంద్రం శుభవార్త తెలిపింది. ఈ నెల 7న రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తాయని అమరావతి వాతావరణ కేంద్రం అంచనా వేసింది. శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, విశాఖపట్నం, అనకాపల్లి, పల్నాడు, చిత్తూరు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. మిగతా చోట్ల తేలికపాటి వానలు పడతాయని తెలిపింది. కాగా ఇవాళ 30 మండలాల్లో తీవ్ర వడగాలులు, 247 మండలాల్లో వడగాలులు వీచే అవకాశం ఉందని పేర్కొంది.

Next Story

Most Viewed