కాకినాడలో వైద్య విద్యార్థి ఆత్మహత్య

by Anil Sikha |
కాకినాడలో వైద్య విద్యార్థి ఆత్మహత్య
X

దిశ, కాకినాడ ప్రతినిధి : వైద్య విద్య చదువుతున్న విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన కాకినాడ రంగరాయ మెడికల్ కాలేజీలో ఇవాళ తెల్లవారుజామున చోటుచేసుకుంది. ఎమ్మార్సీ బాయ్స్ హాస్టల్ లో రావూరి సాయిరాం (22) అనే విద్యార్థి హాస్టల్ గదిలో ఫ్యాన్ కు ఉరేసుకుని వేలాడుతుండటం తోటి విద్యార్థులు గమనించారు. వారు వెంటనే కిందకు దించి ఆస్పత్రికి తీసుకువెళ్లారు. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. సాయిరాం ఎంబీబీఎస్ రెండో సంవత్సరం చదువుతున్నాడు. ఎందుకు ఉరి వేసుకున్నాడో అనే కోణంలో పోలీసులు విచారిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Next Story

Most Viewed