- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మోడీ పాలనలో మీడియాకు స్వేచ్ఛ లేదు : తులసి రెడ్డి
by Vinod kumar |
X
దిశ, కడప: మోడీ పాలనలో మీడియాకు స్వేచ్ఛ లేదని, ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిందని కాంగ్రెస్ రాష్ట్ర మీడియా ఛైర్మన్ తులసి రెడ్డి తీవ్ర స్థాయిలో ఆరోపించారు. గురువారం వేంపల్లెలో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఫ్రాన్స్‌కు చెందిన ఆర్ఎస్ఎఫ్ అనబడే అంతర్జాతీయ మీడియా పర్యవేక్షక సంస్థ మీడియా స్వేచ్ఛపై 180 దేశాలలో సర్వే నిర్వహించగా భారత్ కు 161 వ స్థానం వచ్చిందన్నారు.
నార్వే, ఐర్లాండ్, డెన్మార్క్ దేశాలకు వరుసగా 1,2,3 స్థానాలు, పాకిస్తాన్ కు 150, శ్రీలంక కు 135 వ స్థానాలు వచ్చాయన్నారు. చివరకు ఆఫ్ఘనిస్తాన్ కూడా 152 వ స్థానంలో భారత్ కంటే మెరుగైన స్థానంలో ఉండడం గమనార్హం అన్నారు. మీడియా రంగానికి ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకర దేశంగా భారత్ ఉందని ఆ నివేదిక పేర్కొందని తులసిరెడ్డి తెలిపారు. ఇప్పటికైనా ప్రజాస్వామ్య వాదులు మేల్కొనాలని తులసిరెడ్డి సూచించారు.
Advertisement
Next Story