Viral Video:మయూరాల సుందర నాట్యం..ఆ న‌ర్త‌న‌కు ప‌ర్యాట‌కులు ఫిదా!

by Jakkula Mamatha |
Viral Video:మయూరాల సుందర నాట్యం..ఆ న‌ర్త‌న‌కు ప‌ర్యాట‌కులు ఫిదా!
X

దిశ,వెబ్‌డెస్క్:ఇటీవల పక్షులు, జంతువులకు సంబంధించిన వీడియోలు వైరల్(Viral) అవుతున్నాయి. అయితే చాలా మందికి నెమలి(peacock) అంటే ఇష్టం ఉంటుంది. ఇక మయూరం నాట్యం చేస్తే చూడాలని అనుకుంటుంటారు. ఒళ్లంతా కన్నులతో ఎంతో అందంగా కనిపించే మయూరం అందరినీ ఇట్టే ఆకర్షిస్తుంది. అయితే ఎవరైనా అమ్మాయి అందంగా నాట్యం చేస్తే.. అచ్చం నెమలిలా నాట్యం చేస్తుందని పొగుడుతారు. మరి అలాంటి ఓ నెమలి(peacock) ప్రకృతి ఒడిలో పురి విప్పి నాట్యం చేస్తే ఆ దృశ్యం(Scenes) వర్ణానాతీతం. ఎందుకంటే నెమలి నాట్యం చేయడం చూస్తే..ప్రకృతిలో ఇంతకు మించిన అందమైన దృశ్యం(Scenes) ఉంటుందా అని అనిపిస్తుంది.

అసలు విషయంలోకి వెళితే..న‌ల్ల‌మ‌ల్ల అడ‌వుల్లోని శ్రీశైలం ఘాట్ రోడ్డులో ఇలాంటి దృశ్యమే దర్శనమిచ్చింది. పచ్చని ఆహ్లాదకర వాతావరణంలో అందమైన నెమళ్ళు న‌డిరోడ్డుపై పురి విప్పి నాట్యం చేశాయి. నెమ‌ళ్లు(peacock) పురివిప్పి ఆడుతున్న దృశ్యాలు ప‌ర్యాట‌కుల‌ను ఎంతో ఆక‌ర్షించాయి. ఆ రమణీయ దృశ్యాల‌(Scenes)ను ప‌ర్యాట‌కులు త‌మ కెమెరా(Camera) ద్వారా ఫొటోలు, సెల్ఫీలు తీయడం జరిగింది. ఈ దృశ్యాన్ని చూసిన ప్రతి ఒక్కరు వావ్ ఎంత అందంగా ఉంది అంటూ కామెంట్లు పెడుతున్నారు. ప్రజెంట్ ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

Advertisement

Next Story

Most Viewed