AP Assembly: ‘ఈగల్’తో గంజాయి కట్టడి.. హోంమంత్రి అనిత

by Anil Sikha |
AP Assembly: ‘ఈగల్’తో గంజాయి కట్టడి.. హోంమంత్రి అనిత
X

దిశ, డైనమిక్​ బ్యూరో: గంజాయి నిర్మూలనకోసమే ప్రత్యేక 'ఈగల్'(eagle) వ్యవస్థను ఏర్పాటు చేసినట్లు హోంమంత్రి వంగలపూడి అనిత(home minister anitha) అన్నారు. ఈ రోజు అసెంబ్లీలో ప్రత్నోత్తరాల సమయంలో ఆమె మాట్లాడారు. జీవో ఎంఎస్ నంబర్: 145 ద్వారా ఐజీ స్థాయి ఐపీఎస్ ను విభాగాధిపతిని చేసి ఈగల్ కు బడ్జెట్ లో ప్రత్యేక కేటాయింపులు చేశామన్నారు.రాష్ట్రవ్యాప్తంగా ప్రతి జిల్లాలో ఒకటి చొప్పున 26 నార్కోటిక్ సెల్స్ ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. 11వేల ఎకరాల గంజాయి సాగును 100 ఎకరాలకు నియంత్రించామని తెలిపారు. ఏపీలోని 7 మండలాల్లోని 375 గ్రామాల్లో 20 హాట్ స్పాట్ లను గుర్తించి సాగు లేకుండా చేశామన్నారు. గంజాయి సాగుకు అలవాటుపడిన కుటుంబాలను కౌన్సిలింగ్ చేసి ప్రత్యామ్నాయ పంటలు వేసుకునేలా ప్రోత్సహించినట్లు అనిత తెలిపారు. 359 కుటుంబాలు గంజాయికి (ganja)బదులు ఇతర పంటలను పండిస్తున్నాయని అన్నారు. పొరుగు రాష్ట్రాల నుంచి గంజాయి రవాణాను అరికడుతున్నామని తెలిపారు.40,088 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నామని, 564 గంజాయిని రవాణా చేసే వాహనాలను సీజ్ చేశామని వెల్లడించారు. విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ ఆధ్వర్యంలో స్కూళ్లలోనూ ఈగల్ కమిటీల ఏర్పాటు చేశామన్నారు. ఏపీలో 44 ప్రభుత్వ, ప్రైవేట్ డీ ఎడిక్షన్ సెంటర్లు ఉన్నయని, జైళ్లలోనూ డీఎడిక్షన్ సెంటర్ల ఏర్పాటుకు కేంద్రహోంశాఖ మార్గనిర్దేశం చేసిందన్నారు.డ్రోన్ టెక్నాలజీ, ఎడ్రిన్ శాటిలైట్, ప్రత్యామ్నాయాలతో గంజాయి సాగు అరికడుతున్నామని తెలిపారు.

Next Story