Ap News: ఏపీలో బదిలీ అయిన ఐపీఎస్‌ అధికారులు వీళ్లే...

by srinivas |   ( Updated:2023-09-05 10:24:14.0  )
Ap News: ఏపీలో బదిలీ అయిన ఐపీఎస్‌ అధికారులు వీళ్లే...
X

దిశ, వెబ్ డెస్క్: ఏపీలో పలువురు ఐపీఎస్ అధికారులు బదిలీ అయ్యారు. అడిషినల్ డైరెక్టర్ జనరల్ రవిశంకర్ ఐఎన్ఆర్‌ను విశాఖ పోలీస్ కమిషనర్‌గా ప్రభుత్వం బదిలీ చేసింది. విశాఖ సీపీగా ఉన్న త్రివిక్రవర్మను ఎస్పీఎఫ్ ఐజీగా బదిలి అయ్యారు. రైల్వే అడిషినల్ డీజీపీగా ఉన్న కుమార్ విశ్వజిత్‌ను విజిలెన్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ ఏడీజీగా ప్రభుత్వం బదిలీ చేసింది. విశాఖ పోలీస్ కమిషనరేట్‌‌ను ప్రభుత్వం అప్‌గ్రేడ్ చేసింది. దీంతో ఐజీ క్యాడర్‌లో ఉన్న అధికారిని మార్చింది. అంతేకాదు ఆ స్థానంలో అడిషినల్ డీజీని నియమించింది.

ఇక విశాఖ లా అండ్ ఆర్డర్ డీసీపీగా కె.శ్రీనివాసరావు, తూర్పుగోదావరి ఎస్పీగా పి. జగదీశ్, అన్నమయ్య జిల్లా ఎస్పీగా బొడ్డేపల్లి కృష్ణారావు, కడప జిల్లా ఎస్పీగా సిద్దార్థ కౌశల్, అనంతపురం 14వ బెటాలియన్ కమాండెంట్‌గా ఆర్.గంగాధర్ రావు, అనంతపురం ఎస్పీగా అంబురాజన్‌తో పాటు ఏసీబీ ఎస్పీగా నయూం అస్మీ, గ్రేహౌండ్స్ ఏస్పీగా వసంత విద్యాసాగర్ నాయుడును ప్రభుత్వం నియమించింది.

Advertisement

Next Story