జీవితకాలం టైం ఇస్తున్న చేతనైంది చేసుకోండి: మంత్రి కొడాలి నాని

by Disha News Desk |
జీవితకాలం టైం ఇస్తున్న చేతనైంది చేసుకోండి: మంత్రి కొడాలి నాని
X

దిశ, ఏపీ బ్యూరో: గుడివాడలో నన్ను ఓడించలేక టీడీపీ ప్రభుత్వం లేనిపోని ప్రచారాలు చేస్తు నన్ను గద్దేదించాలని ప్రయత్నిస్తుందాని మంత్రి కొడాలి నాని ద్వజమెత్తారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. మూడు రోజులు క్యాసినో జరిగితే 362 రోజులు టీడీపీ చీర్ బాయ్స్ ప్రచారం చేస్తున్నారన్నారు. స్థానిక టీడీపీ నేతలు పట్టించుకోని విషయం పై టీడీపీ చీర్ బాయ్స్ ప్రచారం చేయడం హాస్యాస్పదం అన్నారు. టీడీపీ నేతలకు జీవితకాలం టైం ఇస్తున్నానని చేతనైంది చేసుకో మంటు సవాల్ చేశారు.

గుడివాడలో క్యాసినో కి రూ.500 కోట్లు వస్తే, 50 క్యాసినోలు ఉన్న గోవాకి ఎన్ని వేల కోట్లు రావాలని ప్రశ్నించారు. గుడివాడ ప్రజలు అమాయకులు కాదంటు వారికి అన్ని విషయాలు తెలుసంటు ధీమా వ్యక్తం చేశారు. టీడీపీ చీర్ బాయ్స్ క్యాసినో గురించి పోలీసులకు ఫిర్యాదులు చెయ్యడం అవివేకమన్నారు. త్వరలో క్యాసినో వ్యవహారంపై బైడెన్‌కు కూడా టీడీపీ నేతలు ఫిర్యాదు చేస్తారేమో? అంటూ ఎద్దేవా చేశారు.

Advertisement

Next Story