శ్రీపద్మావతి అమ్మవారిని దర్శించుకున్న మహారాష్ట్ర సీఎం ఏక్‌నాథ్ షిండే

by Seetharam |
శ్రీపద్మావతి అమ్మవారిని దర్శించుకున్న మహారాష్ట్ర సీఎం ఏక్‌నాథ్ షిండే
X

దిశ, డైనమిక్ బ్యూరో : తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారిని మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్ నాథ్ షిండే దర్శించుకున్నారు. రెండు రోజుల తిరుపతి జిల్లా పర్యటనలో భాగంగా శుక్రవారం ఉదయం కుటుంబ సమేతంగా శ్రీపద్మావతి అమ్మవారిని దర్శించుకున్నారు. తొలుత ఆలయానికి చేరుకున్న ఏక్ నాథ్ షిండ్‌కు అధికారులు, టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డిలు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. అనంతరం మహారాష్ట్ర సీఎం ధ్వజ స్తంభానికి మొక్కులు చెల్లించుకున్నారు. ఆ తర్వాత శ్రీ పద్మావతి అమ్మవారిని దర్శించుకున్నారు. అనంతరం వేద పండితులు ఆశీర్వచనం పలకగా ఆలయ అధికారులు తీర్థప్రసాదాలు అందజేశారు.

Advertisement

Next Story

Most Viewed