- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
బలపడుతున్న అల్పపీడనం.. మరో ఐదు రోజుల పాటు భారీ వర్షాలు
దిశ, వెబ్‌డెస్క్: జూన్ నెల చివర్లో కురిసిన భారీ వర్షాలకు అల్లాడిపోయిన ఏపీ ప్రజలను మరోసారి వాన గండం వెంటాడుతుంది. బంగాళఖాతంలో ఏర్పడిన అల్పపీడనానికి తోడు, తుఫాను వచ్చి చేరడంతో రెండు రోజుల నుంచి రాష్ట్రంలోని కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాల్లో మోస్తారు వర్షాలు కురుస్తున్నాయి. ఈ వర్షాలు నాలుగు రోజుల పాటు కొనసాగుతాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. దీంతో అధికార యంత్రాంగం అప్రమత్తమై తిరుపతి, నెల్లూరు జిల్లాల్లో ముందుజాగ్రత్తగా కంట్రోల్ రూమ్‌లను ఏర్పాటు చేశారు.
ఈ క్రమంలో ఏపీ ప్రజలకు వాతావరణ శాఖ మరో పిడుగు లాంటి వార్త చెప్పింది. ఉపరితల ఆవర్తనం కాస్త ఆగ్నేయ బంగాళాఖాతంలో బలపడి అల్పపీడనంగా మారింది. దీంతో రాష్ట్రంలో మరో ఐదు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెప్పుకొచ్చింది. ఈ అల్పపీడనం కారణంగా.. దక్షిణ కోస్తాలో అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని.. 2 రోజుల్లో దక్షిణ కోస్తా తీరం వైపు అల్పపీడనం పయనిస్తుందని.. వాతావరణశాఖ డైరెక్టర్ శ్రీనివాస్ తెలిపారు. ఇదిలా ఉంటే.. ప్రస్తుతం పలు జిల్లాల్లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ఆయా జిల్లాల కలెక్టర్లు స్కూళ్లకు సెలవులు ప్రకటించారు.