- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- OTT Release
AP Weather: రాగల 36 గంటల్లో ముప్పు.. ఏపీ జిల్లాలకు హెచ్చరిక
దిశ, వెబ్ డెస్క్: నైరుతి బంగాళాఖాతంలో ప్రస్తుతం ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని, రాగల 36 గంటల్లో అది అల్పపీడనంగా (Low Pressure) మారనుందని ఐఎండీ వెల్లడించినట్లు.. ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ రోణంకి కూర్మనాథ్ (Ronanki Kurmanath) తెలిపారు. ఈ అల్పపీడనం తదుపరి రెండ్రోజుల్లో పశ్చిమ దిశగా కదులుతూ తమిళనాడు / శ్రీలంక తీరాలవైపు వెళ్తుందని పేర్కొన్నారు. ప్రస్తుతం నైరుతి బంగాళాఖాతం నుంచి తూర్పు మధ్య బంగాళాఖాతం వరకూ విస్తరించి ఉన్న ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలో.. మూడురోజుల పాటు మోస్తరు నుంచి భారీ వర్షాలు (Rains in AP) కురుస్తాయని వివరించారు.
నవంబర్ 12,13,14 తేదీల్లో భారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించారు. రాయలసీమ, దక్షిణకోస్తాలోని కొన్ని ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు, అక్కడక్కడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. భారీ వర్షాల హెచ్చరికల నేపథ్యంలో ప్రజలు, రైతులు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు. రైతులు వరికోతలు, ఇతర వ్యవసాయ పనుల్లో తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
దీని ప్రభావంతో మంగళ, బుధ,గురువారాల్లో రాయలసీమ, దక్షిణకోస్తాలో కొన్ని ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు,మిగిలిన చోట్ల అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు.వర్షాల నేపథ్యంలో వరికోతలు,ఇతర వ్యవసాయ పనుల్లో రైతులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. pic.twitter.com/USs32LIR6t
— Andhra Pradesh State Disaster Management Authority (@APSDMA) November 9, 2024