- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఈ నెల 29 నుంచి లోకేష్ పాదయాత్ర తిరిగి ప్రారంభం
దిశ, వెబ్‌డెస్క్: టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్ట్‌తో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేపడుతున్న యువగళం పాదయాత్రకు బ్రేకులు పడ్డ విషయం తెలిసిందే. ప్రస్తుతం న్యాయపరంగా చంద్రబాబు కేసులపై టీడీపీ పోరాటం చేస్తోంది. ఏసీబీ, హైకోర్టు, సుప్రీంకోర్టుల్లో పిటిషన్లు వేయగా.. బాబుకు త్వరలో ఊరట దక్కుతుందని టీడీపీ వర్గాలు యోచిస్తున్నాయి. చంద్రబాబు అరెస్ట్‌పై జాతీయ స్థాయిలో చర్చ జరిగేలా చేసేందుకు ఢిల్లీ వేదికగా ప్రయత్నాలు చేసిన లోకేష్.. త్వరలోనే తిరిగి అమరావతికి రానున్నారు.
ఈ నెల 29వ తేదీ నుంచి పాదయాత్ర తిరిగి ప్రారంభించాలని లోకేష్ నిర్ణయం తీసుకున్నారు. ఆ రోజు ఉదయం 8.15 గంటలకు అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోలు నియోజకవర్గం నుంచి యువగళం పాదయాత్ర ప్రారంభించనున్నారు. చంద్రబాబు అరెస్ట్‌పై ప్రభుత్వ వైఖరిని బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లి టీడీపీ కార్యకర్తలకు భరోసా కల్పించనున్నారు. ఇప్పటికే లోకేష్ పాదయాత్రకు పోలీసుల నుంచి అన్ని అనుమతుల వచ్చాయి. చంద్రబాబును అక్రమంగా అరెస్ట్ చేయడం, ఇన్నర్ రింగ్ రోడ్ వ్యవహారంలో తనపై కేసు నమోదు చేయడం లాంటి అంశాలను బలంగా ప్రజల్లోకి లోకేష్ తీసుకెళ్లనున్నారు.