- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
తాళాలు వేసిన ఇళ్లే వారి టార్గెట్.. నలుగురు అంతరాష్ట్ర దొంగల అరెస్ట్
దిశ, తిరుపతి: నలుగురు అంతరాష్ట్ర దొంగల అరెస్టు చేసిన ఘటన తిరుపతిలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. జిల్లా ఎస్పీ పరమేశ్వర్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. ఆటోనగర్ బస్ స్టాప్ వద్ద నలుగురు వ్యక్తులు అనుమానిత వ్యక్తులను అరెస్టు చేసి వారి వద్ద నుంచి నగలను సాధించడం జరిగిందని పేర్కొన్నారు. తిరుపతి లోని చంద్రగిరి పలు ప్రాంతాల నందు పగటిపూట తాళాలు వేసి ఉన్న ఇంటి పరిసరాల వద్ద రెక్కీ నిర్వహించడం తో పాటు రాత్రి వేళల ఇంటికి తాళాలు పగలగొట్టి దొంగతనాలకు పాల్పడే వారిని వివరించారు. కర్ణాటక రాష్ట్రం చిక్బలాపూర్ చెందిన కృష్ణప్ప రాజేష్ (20), మాంబేడు గ్రామానికి చెందిన మొగిలి భాను ప్రకాష్ అలియాస్ భాను (23), కండ్రిగ గ్రామానికి చెందిన చందు (24), సత్య సాయి జిల్లాకి చెందిన నామ్మే అలియాస్ రామాంజనేయులు అలియాస్ సాయి రామ్ (24) అరెస్టు చేయడం జరిగిందని వివరించారు. వీరి నుండి 870 గ్రాములు బంగారు నగలను స్వాధీనం చేసుకోవడం జరిగిందన్నారు.
వీరిపై గతంలో పుత్తూరు, చంద్రగిరి, కార్వేటినగరం, వాయల్పాడు, బిట్రగుంట, కొత్తచెరువు ఓడిసి, పోలీస్ స్టేషన్ పరిధిలో పలు రకాల దొంగతనాలు చేసి జైలు శిక్ష అనుభవించడం జరిగిందన్నారు. వీరిపై మన రాష్ట్రంతో పాటు కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల్లో కూడా నమోదైన కేసులను లెక్కిస్తే ఒక్కొక్కరిపై గతంలో పది నుంచి పదిహేను కేసులు ఉన్నట్లు తేలిందన్నారు. వీరిపై పీడీ యాక్ట్ కేసులు కూడా నమోదు చేయడం జరుగుతుందని తెలిపారు. ఈ కేసును చేదించిన ఉత్తమ ప్రతిభ చూపిన వారికి అభినందించి రివార్డులు ప్రకటించారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ లా అండ్ ఆర్డర్ కులశేఖర్, క్రైమ్ అదనపు ఎస్పీ విమల కుమారి, ఈస్ట్ డీఎస్పీ సురేందర్ రెడ్డి, అలిపిరి సీఐ అబ్బన్న, అలిపిరి ఎస్సైలు నరసింహారావు, ఇమ్రాన్ భాష సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.