Golden cobra:బంగారు పడగ పాము.. చూడడానికి ఎగబడుతున్న స్థానికులు

by Jakkula Mamatha |
Golden cobra:బంగారు పడగ పాము.. చూడడానికి ఎగబడుతున్న స్థానికులు
X

దిశ,వెబ్‌డెస్క్: విశాఖపట్నంలోని యారాడ నేవీ ఉద్యోగుల క్వార్టర్స్‌(Navy Staff Quarters)లో అరుదైన నాగు పాము కనిపించింది. ఈ పాము పడగ మొత్తం బంగారు వర్ణం(Golden color)లో కనిపిస్తుంది. పడగకు ముందు వెనుక మాత్రమే గోల్డ్ కలర్‌లో, మిగతా భాగం మొత్తం సాధారణంగా ఉండటం విశేషం. అయితే ఈ ఆశ్చర్యకరమైన పాము(Golden nagu) ఓ ఉద్యోగి కార్ షెడ్‌లో దర్శనమిచ్చింది. కారు బయటకు తీస్తున్న సమయంలో ఈ పామును చూసిన సదరు ఉద్యోగి స్నేక్ క్యాచర్ నాగరాజుకు సమాచారం అందించారు. వెంటనే అక్కడికి చేరుకున్న నాగరాజు ఈ పామును చూసి ఆశ్చర్యపోయాడు.

ఈ క్రమంలో ఆ పామును బంధించారు. ఈ అరుదైన పాము(Snake)ను స్థానికులు ఆసక్తిగా తిలకించారు. అనంతరం స్నేక్ క్యాచర్(Snake Catcher) నాగరాజు ఈ పామును జనావాసాలకు దూరంగా వదిలిపెట్టారు. కాగా, ఇలాంటి పాములు చాలా అరుదుగా కనిపిస్తాయని, తొమ్మిదేళ్ల క్రితం ఇలాంటి పామును చూశానని స్నేక్ క్యాచర్ నాగరాజు చెప్పారు. స్వర్ణ నాగు(Golden nagu)గా పేరుగాంచిన ఈ పాము ఎడారి ప్రాంతంలో నివసిస్తూ ఉంటుంది. ప్రధానంగా ఆఫ్రికాలో ఈ జాతి పాములు ఎక్కువగా కనిపిస్తాయి. దీని శాస్త్రీయ నామం కేప్ కోబ్రా. పసుపు కోబ్రా అని కూడా పిలుస్తారు. ఇది దక్షిణాఫ్రికా ఎడారి, సెమీ ఎడారి ప్రాంతాలతో నివసించే అత్యంత విషపూరితమైన నాగుపాము జాతికి చెందినదని స్నేక్ క్యాచర్ చెబుతున్నారు.

Advertisement

Next Story