- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
గంజాయి సరఫరాకు కొత్త ఎత్తులు...
గంజాయి సరఫరాకు స్మగ్లర్లు సరికొత్త వ్యూహాలను రచిస్తున్నారు. అనుమానాలు తలెత్తకుండా, పోలీసులకు పట్టుబడకుండా తరలించేందుకు కొత్త ఎత్తులు వేస్తున్నారు. కానీ, పోలీసులకు ఎక్కడో ఒకచోట పట్టుబడుతూనే ఉన్నారు. తాజాగా అన్నవరంలో రంపం పొట్టు మాటున, అల్లూరి జిల్లాలో బియ్యం బస్తాల ముసుగులో తరలించేందుకు సిద్ధమయ్యారు. ఒక్క అల్లూరి లోనే 1700 కేజీల గంజాయి పట్టుబడింది. దీని విలువ రూ.3కోట్లు ఉంటుందని అంచనా.
రంపం పొట్టులో ప్యాకింగ్ చేసి.. గంజాయి
దిశ, అన్నవరం: రంపంపోట్టులో గంజాయి సరఫరా చేస్తున్న నిందితులను అన్నవరం పోలీసులు పట్టుకున్నారు. దీనిపై పెద్దాపురం డీఎస్పీ సుంకర మురళీమోహన్ గురువారం మీడియా సమావేశం ఏర్పాటు చేసి వివరాలను వెల్లడించారు. రాజవొమ్మంగికి చెందిన పాలపర్తి వెంకట కొండలరావు, లోద్ది గ్రామానికి చెందిన గమ్మెల సాంబశివ, వట్టిగడ్డ గ్రామానికి చెందిన నాయుడు, రౌతులపూడి మండలం ఎస్.పైడిపాలకు చెందిన కాళ్ల శివ జమీల్, కిర్లంపూడి మండలం సోమవరం గ్రామానికి చెందిన పంచదార్ల వీరబాబు, అల్లూరి సీతారామరాజు జిల్లా గరిమండ గ్రామానికి చెందిన కుర్రా కామరాజు, పిఠాపురానికి చెందిన పూచి రామస్వామిలు కలిసి తమిళనాడుకు చెందిన యోగ్నం జయ పాండే, యోగ పాండియన్ల ద్వారా గంజాయిని తరలించేందుకు సిద్ధమయ్యారని అన్నారు. బస్తాలలో రంపంపొట్టుతో కలిపి సుమారు 32 కేజీల గంజాయిని ప్యాకింగ్ చేశారని అన్నారు.
దీనిపై పక్కా సమాచారం అందుకున్న సీఐ కిషోర్ బాబు దాడులు నిర్వహించి తొమ్మిది మందిని అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. మరో ఇద్దరు కాళ్ల శివ జమీల్, నాయుడు పరారీలో ఉన్నట్లు డీఎస్పీ మురళీమోహన్ వెల్లడించారు. రెండు మోటార్ సైకిళ్లు, ఆరు సెల్ ఫోన్లు స్వాధీనపరచుకున్నట్లు వివరించారు. నిందితులను చాకచక్యంగా పట్టుకున్న సీఐ కిషోర్ బాబుతోపాటు అన్నవరం, ప్రత్తిపాడు, ఏలేశ్వరం ఎస్ఐలను అభినందించారు. గంజాయి మత్తులో పడి యువత పెడదారి పట్టకుండా పోలీసు శాఖ పూర్తిస్థాయిలో దృష్టి సారించిందని అన్నారు. గంజాయి గురించి ఎవరికైనా సమాచారం తెలిస్తే వెంటనే పోలీసులకు తెలపాలని డీఎస్పీ సూచించారు.
బియ్యం బస్తాల మాటున..
దిశ, ఉత్తరాంధ్ర: అల్లూరి జిల్లాలో అంతర్రాష్ట్ర గంజాయి స్మగ్లర్ల ముఠా పట్టుబడింది. సుమారు 1700 కిలోల గంజాయిని చింతపల్లి పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ముగ్గురు నిందితులను అరెస్టు చేయగా, పరారీలో ఉన్న మిగిలిన వారి కోసం గాలిస్తున్నారు. పోలీసుల వివరాల మేరకు.. పోలీసు చెక్‌పోస్టుల నుంచి తప్పించుకునేందుకు నకిలీ వే బిల్లులను సృష్టించి పగిలిన బియ్యం బస్తాలలో గంజాయిని తరలిస్తున్నారు. ఈ ముఠాలో మహారాష్ట్ర, ఒడిశా, ఆంధ్రప్రదేశ్‌కు చెందినవారు ఉన్నట్లు తెలిపారు. వీరి గంజాయిని ఒడిశా జిల్లా మల్కన్‌గిరి, కోరాపుట్‌లలో చేపడుతున్నారని అన్నారు. జోడియాపుట్ గ్రామానికి చెందిన ఖేముడు సీతారాం, పరారీలో ఉన్న మరో నిందితుడితో కలిసి గంజాయి సాగు చేస్తున్నారని తెలిపారు. రవాణా కోసం ఉపయోగించే వాహనం యజమాని అయిన మహారాష్ట్ర రాజు, ఒడిశా నుండి చిత్రకొండ అడవుల ద్వారా అల్లూరి సీతారామరాజు జిల్లా ధారకొండ శివార్లకు తలపై మోసే కూలీల ద్వారా గంజాయిని తరలించడానికి ఆర్డర్లు ఇచ్చారని అన్నారు. ధారకొండ అడవుల్లో, చుట్టుపక్కల ప్రాంతాల్లో గంజాయిని లోడ్ చేసి తరలిస్తుండగా, చింతపల్లి సమీపంలో పోలీసుల వాహన తనిఖీల్లో పట్టుబడినట్లు తెలిపారు. నిందితుల మొబైల్ ఫోన్లు, టాటా ట్రక్కు, బైక్, నకిలీ వే బిల్లులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. చింతపల్లి సబ్‌డివిజన్ బృందానికి ఏడీ. ఎస్పీ చింతపల్లి కొమ్మి ప్రతాప్ శివ కిషోర్, సీఐ చింతపల్లి కె రమేష్, నలుగురు ఎస్సైలను అడిషినల్ ఎస్పీ అడ్మిన్ ఎఎస్ఆర్ తుహిన్ సిన్హా అభినందించారు.
- Tags
- ganjai