Lakshmi Parvathi: లక్ష్మీపార్వతికి షాకిచ్చిన సీఎం చంద్రబాబు.. అధికారులకు కీలక ఆదేశాలు

by Shiva |
Lakshmi Parvathi: లక్ష్మీపార్వతికి షాకిచ్చిన సీఎం చంద్రబాబు.. అధికారులకు కీలక ఆదేశాలు
X

దిశ, వెబ్‌డెస్క్: ఎన్టీఆర్ సతీమణి నందమూరి లక్ష్మీపార్వతికి సీఎం చంద్రబాబు ఊహించని షాకిచ్చారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో తెలుగు అకాడమీ చైర్మన్‌గా, వైసీపీ అధికార ప్రతినిధిగా చంద్రబాబు, ఎన్టీఆర్ కుటుంబం ఆమె నిత్యం విమర్శలు గుప్పించే వారు. అయితే, రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో సీన్ ఒక్కసారిగా మారిపోయింది. ఈ క్రమంలోనే ఆంధ్రా యూనివర్శిటీ కీలక ప్రకటన చేసింది. గతంలో లక్ష్మీపార్వతికి కేటాయించిన ‘గౌరవ ఆచార్యురాలు’ హోదాను ఉపసంహరిస్తూ రిజిస్ట్రార్ కిశోర్‌బాబు గురువారం ప్రకటన విడుదల చేశారు. అదేవిధంగా వర్సిటీ పరిశోధకులకు గైడ్‌గా వ్యవహరించే బాధ్యతల నుంచి ఆమెను తప్పించారు.

Advertisement

Next Story