వైసీపీ ప్రభుత్వ పాలనపై ప్రజలే తీర్పు చెబుతారు..లగడపాటి

by Indraja |
వైసీపీ ప్రభుత్వ పాలనపై  ప్రజలే తీర్పు చెబుతారు..లగడపాటి
X

దిశ వెబ్ డెస్క్: రాష్ట్ర విభజన జరిగితే తాను రాజకీయాలకు స్వస్తి పలుకుతాని ప్రకటించిన మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ చెప్పిన మాట ప్రకారం రాష్ట్ర విభజన తరువాత రాజకీయాలకు దూరం అయ్యారు. అయితే అటు లోక్ సభ ఎన్నికలు ఇటు ఏపీ అసెంబ్లీకి ఎన్నికలు త్వరలో జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఆయన ఉన్నటుండి రాజమండ్రిలో దర్శనమిచ్చారు. అలానే మాజీ ఎంపీ హర్షకుమార్‌తో సమావేశమైయ్యారు. దీనితో ఆయన మళ్ళీ రాజకీయాల్లోకి రానున్నారా.? అనే అనుమానం అందరిలో కలుగుతోంది.

ఈ నేపథ్యంలో మీడియాతో మాట్లాడిన ఆయన.. రాష్ట్ర విభజనతోనే తన రాజకీయ జీవితం ముగిసిందని.ఇక పైన రాజకీయాల్లోకి వచ్చే ఉదేశం లేదని తెలిపారు. గత ఎన్నకల్లో లాగా ఈ ఎన్నికలకు సర్వ్ కూడా చెయ్యడం లేదని పేర్కొన్నారు. రాజకీయాలు దూరంగా ఉన్నాను అని తెలిపిన ఆయన.. రాష్ట్రం లో తమిళనాడు తరహాలో జాతీయ పార్టీలు, ప్రాంతీయ పార్టీల మధ్య పోటీ పోయిందని.. రాబోయే ఎన్నికల్లో ప్రాంతీయ పార్టీల మధ్యనే పోటీ ఉంటుందని స్పష్టం చేశారు. ప్రజలు త్వరలోనే వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ప్రభుత్వ పాలనపై తీర్పు చెబుతారని పేర్కొన్నారు. ఇక రాజమండ్రి వస్తే ఉండవల్లి అరుణ్‌కుమార్‌, హర్ష కుమార్ లను కలవడం మామూలే అని తెలిపారు. మొదట హర్షకుమార్‌ను కలిసిన లగడపాటి రాజగోపాల్ ఆ తర్వాత రాజమండ్రి మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ ఇంటికి వెళ్లి ఆయనతో సమావేశం అయ్యారు.

Advertisement

Next Story