Srisalam మల్లన్న హుండీ ఆదాయం రూ.5.11 కోట్లు

by srinivas |   ( Updated:2023-02-22 17:23:19.0  )
Srisalam మల్లన్న హుండీ ఆదాయం రూ.5.11 కోట్లు
X

దిశ, శ్రీశైలం: ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రమైన శ్రీశైలంలో మహా శివరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా ఈ నెల 9వ తేదీ నుంచి 21 వరకు మొత్తం 13 రోజులకు సంబంధించిన హుండీని ఆలయ కార్యనిర్వహణాధికారి లవన్న ఆధ్వర్యంలో లెక్కించారు. అందులో దేవస్థానానికి రూ.5 కోట్ల, 11 లక్షల, 9 వేల, 935లు వచ్చినట్లు ఆలయ అధికారి తెలిపారు. నగదుతో పాటు 100 గ్రాముల 400 మిల్లీ గ్రాముల బంగారం, 6 కేజీల 500 గ్రాముల వెండి అలాగే యుఎస్ఏ డాలర్లు 249, సింగపూర్ డాలర్లు-50, ఆస్ట్రేలియా డాలర్లు- 20, కెనెడా డాలర్లు - 10, కువైట్ దినార్స్- 5 మొదలైన విదేశీ కరెన్సీ కూడా లభించాయని చెప్పారు. పటిష్టమైన భద్రతా ఏర్పాట్ల మధ్య, సీసీ కెమెరాల నిఘాలో ఈ హుండీని లెక్కించినట్లు పేర్కొన్నారు.

Advertisement

Next Story