- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Kurnool: శివమాలతో మంత్రి కాళ్లు మొక్కిన శ్రీశైలం ఈవో
దిశ, శ్రీశైలం: శ్రీశైలం ఈవో వివాదంలో చిక్కుకున్నారు. మల్లన్నను దర్శించుకునేందుకు వెళ్లిన మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి ఆలయ సాంప్రదాయాలతో స్వాగతం పలికారు. శివమాల ధరించి ఉన్న ఈవో సాక్షాత్తు మల్లన్న సన్నిధిలో మంత్రి కాళ్లు మొక్కి ఆశీర్వాదం తీసుకున్నారు. దీంతో ఈవో లవన్న వ్యవహార శైలిని చూసిన భక్తులు మండిపడుతున్నారు. భక్తుల మనోభావాలు దెబ్బతీసే విధంగా వ్యవహరిస్తున్న శ్రీశైలం దేవస్థానం ఈవోను సస్పెండ్ చేయాలని భక్తులు డిమాండ్ చేశారు. మల్లన్న సాక్షిగా భక్తులకు క్షమాపణ చెప్పాలని హిందూ సంఘాలు డిమాండ్ చేస్తున్నారు.
రాష్ట్రం గవర్నర్ బిశ్వభుషన్ హరిచందన్ రాక నేపథ్యంలో చోటు చేసుకున్న ఈ సన్నివేశానికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ఇప్పటికే అవినీతి ఆరోపణలు, పలు వివాదాల్లో కేరాఫ్ అడ్రస్‌గా ఉన్న ఆలయ కార్వనిర్వహణాధికారి మంత్రి పెద్దిరెడ్డి కాళ్లు మొక్కి స్వామి భక్తి చూపి వార్తల్లోకెక్కారు. మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో పూర్తిగా విఫలం కావడంతో భక్తులు ఆగ్రహం చేస్తుండగా వీఐపీ పాసులు అధిక సంఖ్యలో జారీ చేయడంతో జిల్లా అధికారులు చివాట్లు పెట్టినట్లు సమాచారం.