- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Kurnool: శ్రీశైలంలో ఐదుగురు ఉద్యోగుల బదిలీ
దిశ, శ్రీశైలం: శ్రీశైల మహాక్షేత్రంలో ఐదుగురు శాశ్వత ఉద్యోగులను రాయలసీమ జోన్ పరిధిలోని ఆలయాలకు బదిలీ చేశారు. 5 సంవత్సరాలు నుంచి బయటకు కదలని ఉద్యోగులు సాధారణ బదిలీలలో భాగంగా ముందుకు కదిలారు. దేవాదాయశాఖ ఉన్నతాధికారులు ఏఈవో స్థాయి ఒకరు సీనియర్, జూనియర్ అసిస్టెంట్‌లు ఇలా ఐదుగురు ఉద్యోగులను శ్రీకాళహస్తి, కాణిపాకం, మహానంది, తదితర ఆలయాలకు బదిలీలు చేస్తూ ఏపీ రాష్ట్ర దేవాదాయశాఖ కమిషనర్ సత్యనారాయణ ఉత్తర్వులు జారీ చేశారు. బదిలీ అయిన వారిలో దేవస్థానం పి.ఆర్.ఓ శ్రీనివాస్‌ను ఒక సీనియర్ అసిస్టెంట్, ఒక జూనియర్ అసిస్టెంట్‌ని శ్రీకాళహస్తికి మరో జూనియర్ అసిస్టెంట్ మహానందికి మరో జూనియర్ అసిస్టెంట్‌ని కాణిపాకం ఆలయానికి కమిషనర్ బదిలీ చేశారు. బదిలీ అయిన వారు వారం రోజుల్లో వారికి కేటాయించిన ఆలయాల్లో రిపోర్ట్ చేయాలని కమిషనర్ ఉత్తర్వుల్లో సూచించారు.
అయితే గత సంవత్సరంలో జూన్ 30న 44 మందికి శ్రీశైలం దేవస్థానం నుంచి ఇతర ఆలయాలకు బదిలీ చేశారు. కానీ పట్టుమని ఎనిమిది నెలలు తిరక్క ముందే అందరూ మళ్లీ శ్రీశైల దేవస్థానంకి ట్రాన్స్‌ఫర్‌పై వచ్చి విధులు నిర్వహిస్తున్నారు. ఈసారైనా బదిలీలు అయిన వారు ఉంటారా మళ్ళీ సంవత్సరంలో తిరిగి సొంత ఆలయాలకు చేరుకుంటారా అని దానిపై స్థానికంగా చర్చలు మొదలయ్యాయి.