AP News:ఆదోని వన్ టౌన్ సీఐ గా శ్రీరామ్

by Jakkula Mamatha |
AP News:ఆదోని వన్ టౌన్ సీఐ గా శ్రీరామ్
X

దిశ,ఆదోని రూరల్:ఆదోని వన్ టౌన్ సీఐ గా సోమవారం కె.శ్రీరామ్ బాధ్యతలు చేపట్టారు. జిల్లా వ్యాప్తంగా సీఐలను బదిలీ చేయడం జరిగింది. ఎన్నికలకు ముందు వచ్చిన సీఐ తేజ మూర్తి కడప జిల్లా చిన్న చౌక్ పోలీస్ స్టేషన్‌కు బదిలీ అయ్యారు. ఆయన స్థానంలో తిరుపతి ఎన్ఫోర్స్మెంట్ నుంచి బదిలీపై సీఐ శ్రీరామ్ వచ్చారు. గత ప్రభుత్వంలో ఆదోని త్రీ టౌన్ సీఐ గా పనిచేశారు. ఆ సమయంలో క్రికెట్ బెట్టింగ్ ముఠా పై ఉక్కు పాదం మోపి పట్టణ ప్రజలకు సుపరిచితులయ్యారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదని కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఎవరైనా అక్రమ మద్యం, నాటు సారా, పేకాట, క్రికెట్ బెట్టింగ్, మట్కా లాంటివి నిర్వహిస్తే పోలీసులకు సమాచారం తెలియజేయాలని అలాంటి వారి పేర్లు గోప్యంగా ఉంచుతామని నిర్వహిస్తున్న వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుని వారిని కఠినంగా శిక్షిస్తామని తెలిపారు. పోలీస్ సిబ్బంది కూడా ప్రతి ఒక్కరూ బాధ్యతగా పనిచేయాలని సూచించారు.

Advertisement

Next Story

Most Viewed