Kurnool: చెప్పుతో కొట్టాడని టీడీపీ మాజీ సర్పంచ్ హత్య.. వీడిన మిస్టరీ

by srinivas |
Kurnool: చెప్పుతో కొట్టాడని టీడీపీ మాజీ సర్పంచ్ హత్య.. వీడిన మిస్టరీ
X

దిశ, వెబ్ డెస్క్: కర్నూలు జిల్లా పత్తికొండ నియోజకవర్గం హోసూరులో టీడీపీ మాజీ సర్పంచ్ శ్రీనివాసులు దారుణ హత్యకు గురైన విషయం తెలిసిందే. అయితే ఈ కేసులో పోలీసులు పురోగతి సాధించారు. టీడీపీ నేత శ్రీనివాసులు, రిటైర్డ్ హెచ్ కానిస్టేబుల్ నర్సింహులు మధ్య కొంతకాలంగా విభేదాలు కొనసాగుతున్నాయి. రాజకీయ పట్టు కోసం ఇద్దరి మధ్య గొడవలు సైతం జరిగాయి. గతంలో నరసింహులను శ్రీనివాసుల చెప్పుతో కొట్టారు. దీంతో శ్రీనివాసులపై నర్సింహులు కక్ష పెంచుకున్నారు.

అంతేకాకుండా శ్రీనివాసులకు వ్యవసాయ సహకార సంఘం చైర్మన్ పదవి ఇస్తారని ప్రచారం జరుగుతుండటంతో నర్సింహులు జీర్ణించుకోలేకపోయారు. ఎలాగైనా సరే శ్రీనివాసులను అడ్డు తొలగించుకోవాలని అనుకున్నారు. ఈ మేరకు శ్రీనివాసులు బహిర్భూమికి వెళ్లిన సమయంలో గ్రామానికి చెందిన నలుగురి సాయంతో నర్సింహులు వేటకొడవళ్లతో దాడి చేశారు. ఈ దాడిలో గాయపడిన శ్రీనివాసులు అక్కడికక్కడే మృతి చెందడంతో ఆధారాలు దొరకకుండా చేసేందుకు కారం పొడి చల్లారు. కేసు నమోదు చేసిన పోలీసులు మిస్టరీని ఛేదించారు. అయితే శ్రీనివాసులుపై దాడి చేసిన వారిలో ఇద్దరు మైనర్లు ఉన్నారని తెలుస్తోంది. నాలుగు రోజుల క్రితం జరిగిన ఈ ఘటన కర్నూలు జిల్లాలో సంచలన సృష్టించింది.

Advertisement

Next Story

Most Viewed