Srisailam reservoir:శ్రీశైలం జలాశయానికి కొనసాగుతున్న వరద ఉధృతి

by Jakkula Mamatha |
Srisailam reservoir:శ్రీశైలం జలాశయానికి కొనసాగుతున్న వరద ఉధృతి
X

దిశ ప్రతినిధి,శ్రీశైలం:శ్రీశైలం జలాశయానికి భారీగా వరద నీరు కొనసాగుతోంది. ఎగువ పరివాహక ప్రాంతాలు అయినా జూరాల, సుంకేసుల నుంచి 3,26,481 క్యూసెక్కుల వరద నీరు శ్రీశైలం జలాశయానికి వచ్చి చేరుతుంది. దీంతో జలాశయం నీటిమట్టం నీటి సామర్థ్యం పూర్తి స్థాయికి చేరుకోవడంతో ఈ సంవత్సరంలో రెండోసారి జలాశయం 8 రేడియల్ క్రెస్ట్ గేట్లు 12 అడుగుల మేర ఎత్తి 2 గేట్లు 10 అడుగుల మేర ఎత్తివేత దిగువ నాగార్జునసాగర్‌కు అధికారులు నీటిని విడుదల చేస్తున్నారు.

అయితే జలాశయానికి ఇన్ ఫ్లోగా 3,26,481 క్యూసెక్కులు రాగా జలాశయం రెండు రేడియల్ క్రెస్ట్ గేట్లు నుండి అలానే కుడి, ఎడమ జల విద్యుత్ కేంద్రాలలో విద్యుత్ ఉత్పత్తి చేస్తూ దిగువ నాగార్జునసాగర్‌కి జలాశయం నుండి మొత్తం ఔట్ ఫ్లోగా 3,80,499 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. శ్రీశైలం జలాశయం పూర్తి స్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా ప్రస్తుతం పూర్తి స్థాయిలో 885.00 అడుగులు చేరింది. మరోపక్క జలాశయం నీటి నిల్వ కూడా 215.8070 టీఎంసీలు కాగా ప్రస్తుతం పూర్తి స్థాయిలో 214.8870 టీఎంసీలకు చేరింది.

Advertisement

Next Story

Most Viewed