- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Kurnool Mlc Elections నిర్వహణకు పటిష్ట చర్యలు
దిశ, కర్నూలు ప్రతినిధి : జిల్లాలో పట్టభద్రుల, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలను సజావుగా నిర్వహించేందుకు పకడ్బందీ ప్రణాళికలు రూపొందించుకోవాలని నంద్యాల జిల్లా కలెక్టర్ డాక్టర్ మనజీర్ జిలాని సామూన్ ఎన్నికల నోడల్ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ హాల్లో ఎమ్మెల్సీ ఎన్నికల నిర్వహణపై నోడల్ అధికారులతో సమీక్షించి మాట్లాడారు. రాయలసీమ జిల్లాల్లో పట్టభద్రులు, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలను పటిష్టంగా నిర్వహించేందుకు పకడ్బందీ ప్రణాళిక రూపొందించుకోవాలన్నారు. పోలింగ్ స్టేషన్ల జాబితాకు సంబంధించి పట్టభద్రులకు 56, ఉపాధ్యాయులకు 30 పోలింగ్ స్టేషన్లలో ఎన్నికల నిబంధన మేరకు అన్ని మౌలిక వసతుల ఏర్పాట్లను పరిశీలించుకోవాలన్నారు. తుది ఓటర్ల జాబితా ప్రకారం 1400 మించి ఓటర్లు ఉన్న పోలింగ్ స్టేషన్లలో ఒక్కో ఆక్సీలరీ పోలింగ్ స్టేషన్‌ను ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. పోలింగ్ నిర్వహణకు అవసరమయ్యే 700 మంది సిబ్బంది విధులు నిర్వహించేందుకు షెడ్యూల్ ప్రకారం మాస్టర్ ట్రైనర్లతో మూడు పర్యాయాలు శిక్షణ ఇప్పించాలని కలెక్టర్ సూచించారు.
అలాగే 114 మంది బ్యాంకర్ల సిబ్బందిని మైక్రో అబ్జర్వర్లుగా నియమించేందుకు చర్యలు తీసుకోవాలని డీఆర్ఓను ఆదేశించారు. రాండమైజేషన్ పద్ధతిలో సిబ్బందికి పోలింగ్ విధులు కేటాయించేలా చర్యలు తీసుకోవాలని నోడల్ అధికారులకు సూచించారు. పోలింగ్‌కు అవసరమయ్యే బ్యాలెట్ బాక్సులను సిద్ధం చేసుకోవాలన్నారు. పోలింగ్ సామాగ్రితో పాటు డిస్ట్రిబ్యూషన్ సెంటర్ నుంచి పోలింగ్ కేంద్రాలకు బ్యాలెట్ బాక్సుల తరలింపు, తిరిగి భద్రపరిచేందుకు తాత్కాలిక స్ట్రాంగ్ రూములను ఏర్పాటు చేసుకోవాన్నారు. ఎన్నికల పటిష్ట నిర్వహణకు నియమించిన నోడల్ అధికారులు సమన్వయంతో విధులు నిర్వహించాలని సూచించారు. అనంతరం రిజర్వ్ బ్యాంకు అఫ్ ఇండియా రూపొందించిన 'ఆర్థిక అక్షరాస్యత వారోత్సవాలు' అనే వాల్ పోస్టర్లు కలెక్టర్ జిల్లా జాయింట్ కలెక్టర్ టి.నిశాంతి, డీఆర్ఓ పుల్లయ్య, ఇతర అధికారులతో కలిసి ఆవిష్కరించారు.