AP Politics:పోలవరంపై కేంద్ర మంత్రితో మంత్రి నిమ్మల చర్చలు

by Jakkula Mamatha |   ( Updated:2024-07-22 15:05:14.0  )
AP Politics:పోలవరంపై కేంద్ర మంత్రితో మంత్రి నిమ్మల చర్చలు
X

దిశ ప్రతినిధి, కర్నూలు:కేంద్ర జలవనరుల శాఖ మంత్రి సీఆర్ పాటిల్‌ను ఏపీ నీటిపారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు కలిశారు. ఢిల్లీలోని ఆయన కార్యాలయంలో పుష్పగుచ్ఛం ఇచ్చి శుభాకాంక్షలు తెలిపారు. పని విభజనలో భాగంగా సీఎం చంద్రబాబు ఎం.పి నాగరాజుకు కార్మిక సంక్షేమం, ఉపాధి కల్పన, ఇరిగేషన్ శాఖలను కేటాయించిన విషయం తెలిసిందే. దీంతో ఇరిగేషన్‌కి సంబంధించి ఢిల్లీకి వచ్చిన రాష్ట్ర మంత్రి రామానాయుడుతో కలిసి నాగరాజు కేంద్ర మంత్రి పాటిల్‌తో భేటి అయ్యారు. ఈ సందర్భంగా కేంద్రం నుంచి పోలవరంతో పాటు వివిధ ప్రాజెక్టులకు నిధులు కేటాయింపుల పై చర్చించారు.

మంత్రి నిమ్మల మాట్లాడుతూ..పోలవరం ప్రాజెక్ట్ సందర్శనకు రావాలని కేంద్రమంత్రిని ఆహ్వానించినట్లు చెప్పారు. త్వరితగతిన ఆర్ అండ్ ఆర్ ప్రాజెక్ట్ నిధులు ఇవ్వాలని కోరామన్నారు. పోలవరాన్ని చంద్రబాబు హయాంలోనే పూర్తి చేసేందుకు తాము సహకరిస్తామని కేంద్రమంత్రి పాటిల్ చెప్పారని నిమ్మల తెలిపారు. ఇందులో భాగంగా ఎం.పి నాగరాజు జిల్లాలో వేదవతి, గుండ్రేవుల ప్రాజెక్టు ల నిర్మాణం పై కేంద్ర మంత్రితో చర్చించారు. అనంతరం సి.డబ్ల్యు.సి చైర్మన్ దీబాశ్రీ ముఖర్జీని కలిసి రాష్ట్రంలోని నీటి ప్రాజెక్టులపై చర్చించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రులు రామ్మోహన్ నాయుడు, శ్రీనివాస్ వర్మ లతో పాటు ఎంపీలు అప్పలనాయుడు, లక్ష్మీనారాయణ పాల్గొన్నారు.

Read More..

Breaking:‘పోలవరం’ ప్రతిపాదనలకు కేంద్రం అంగీకారం

Advertisement

Next Story

Most Viewed