ఎంపీ సీటు నా జేబులో ఉంది.. మంత్రి జయరాం ఆసక్తికర వ్యాఖ్యలు

by srinivas |   ( Updated:2024-01-12 11:17:09.0  )
ఎంపీ సీటు నా జేబులో ఉంది.. మంత్రి జయరాం ఆసక్తికర వ్యాఖ్యలు
X

దిశ, వెబ్ డెస్క్: ఎంపీ సీటు తన జేబులో ఉందని మంత్రి గుమ్మనూరు జయరాం అన్నారు. గత ఎన్నికల్లో ఆలూరు వైసీపీ నుంచి పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిచి మంత్రి అయ్యారు. 2024 ఎన్నికల్లో ఆయనకు సీఎం జగన్ కర్నూలు ఎంపీ సీటును కేటాయించారు. దీంతో ఆయన శుక్రవారం ఆలూరులో పార్టీ కార్యకర్తలతో భేటీ అయ్యారు. కార్యకర్తలు ఎలా చెబితే అలా నడుకుంటానని చెప్పారు. సీఎం జగన్ ఎంపీ సీటును తన జేబులో ఉంచినా.. కార్యకర్తలు ఒప్పుకుంటేనే ఢిల్లీకి వెళ్తానని, లేదంటే గల్లిలోనే ఉండిపోతానని జయరాం పేర్కొన్నారు. 15 ఏళ్లుగా తనను ఆదరించారని.. ఎప్పటికీ కార్యకర్తల రుణం తీర్చుకోలేనిదన్నారు.

ఎన్నికలకు ఇంకా సమయం ఉందని, ఆలూరులో అభ్యర్థులను మార్చినంత మాత్రాన కార్యకర్తలు ఆందోళన చెందవద్దని మంత్రి జయరాం సూచించారు. నామినేషన్ సమయంలో కూడా బీఫామ్ మారిన సందర్భాలున్నాయని జయరాం ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కార్యకర్తలు ఆదేశిస్తే చాలా దారులున్నాయని తెలిపారు. కార్యకర్తల నిర్ణయంపైనే తన భవిష్యత్ కార్యాచరణ ఉంటుందన్నారు. మంత్రిగా తాను గొడవలను ఏనాడూ ప్రోత్సహించలేదని మంత్రి జయరాం పేర్కొన్నారు.

Advertisement

Next Story