Adoni: లారీ ఢీకొని వ్యాపారి మృతి

by srinivas |   ( Updated:2023-06-03 14:01:40.0  )
Adoni: లారీ ఢీకొని వ్యాపారి మృతి
X

దిశ, ఆదోని: ఆదోనిలో రోడ్డు ప్రమాదం జరిగింది. బైకుతో వెళ్తున్న శరత్ అనే వ్యక్తిని తిరుమలనగర్‌ నెట్టేకల్ క్రాస్ రోడ్డులో లారీ ఢీకొట్టింది. దీంతో శరత్‌కు తీవ్ర గాయాలు కావడంతో ఆదోనీ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ శరత్ మృతి చెందాడు. శరత్ రాత్రి సమయంలో నాగలాపురంలో చికెన్ పకోడా అమ్ముతుంటారు. ఉదయాన్నే షాప్‌ను శుభ్రపరుచుకుని తిరిగి ఆదోనికి వెళ్తుండగా ప్రమాదం జరిగింది. ఎమ్మిగనూరు పోలీసులు లారీని సీజ్ చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Next Story