- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
Nandyala: పెళ్లయిన రెండు నెలలకే దారుణం.. భార్య గొంతు కోసి భర్త పరారీ

దిశ, డైనమిక్ బ్యూరో: రెండు నెలల కాపురంలో అనుమానం చిచ్చు పెట్టింది. భార్య, భర్తల మధ్య నిత్యం తగాదాలే. రెండు నెలల వ్యవధిలో కలిసి కాపురం చేసింది కొద్ది రోజులు మాత్రమే. భార్యపై అనుమానం భూతంగా మారడంతో భర్త ఆమె గొంతు కోసి హతమార్చేందుకు ప్రయత్నించారు. ఈ దారుణ ఘటన నంద్యాలలో జరిగింది. పట్టణంలోని గోపాల్ నగర్‌లో నివాసముండే మౌలాలి, కౌసర్ దంపతుల కుమార్తె సానియాకు అదే వీధికి చెందిన కరీంతో వివాహం జరిపించారు. పెళ్లయిన మరుసటి రోజు నుంచే కరీం తన భార్య సానియాపై అనుమానం పెంచుకున్నారు. ప్రతీరోజు అనుమానంతో సానియాను మానసికంగా,శారీరకంగా వేధించేవారు.
అయితే శసానియా నిద్రమత్తులో ఉండగా కరీం బ్లేడుతో ఆమె గొంతు కోసి హత్యాయత్నానికి పాల్పడ్డారు. సానియా గట్టిగా కేకలు వేయడంతో కరీం అక్కడ నుంచి పరారయ్యారు. దీంతో కుటుంబ సభ్యులు, స్థానికులు సానియాను నంద్యాల ప్రభుత్వ సర్వజన ఆసుపత్రికి తరలించారు. దీంతో ఆస్పత్రిలో బాధితురాలికి వైద్యులు చికిత్స అందిస్తున్నారు. సానియా కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.