Srisalam: 32 రోజుల్లో ఆదాయం ఎంత వచ్చిందంటే..!

by srinivas |
Srisalam: 32 రోజుల్లో ఆదాయం ఎంత వచ్చిందంటే..!
X

దిశ, శ్రీశైలం: శ్రీశైల దేవస్థానంలోని ఉబాయ దేవాలయాల్లో హుండీ లెక్కింపు కార్యక్రమం చేపట్టారు. హుండీ లెక్కింపులో దేవస్థానానికి రూ.4,43,53,163 నగదు లభించింది. హుండీ ద్వారా రూ.4,33,94,902లు రాగా అన్నపూర్ణ భవనంలోని హుండీ ద్వారా రూ.9,58,260 వచ్చింది. ఈ నగదును భక్తులు గత 32 రోజులలో సమర్పించారు. హుండీలో నగదుతో పాటు బంగారం 360 గ్రాముల 500 మిల్లీ గ్రాముల బంగారు, 12 కేజీల 625 గ్రాముల వెండి లభించాయి. అదేవిధంగా యుఎస్ఎ డాలర్లు 2920, ఇంగ్లాండ్ పౌండ్స్ 310, న్యూజిలాండ్ డాలర్లు 770, ఆస్ట్రేలియా డాలర్లు 10, థాయిలాండ్ కరెన్సీ 3900, యూఏఈ దిర్హమ్స్ 40, సౌదీ రియాల్స్ 5, కెనడా డాలర్లు 35 ,మలేషియా రింగేర్స్ 70,ఓవర్ బైసా 200, యూరోస్ 110 లభించాయి. ఈ హుండీ లెక్కింపు పటిష్టమైన భద్రత ఏర్పాట్ల మధ్య సీసీ కెమెరా నిఘాతో జరిగింది. ఈ హుండీ లెక్కింపులో ఆలయ కార్యనిర్వహణ అధికారి ఎస్. లవన్న, ధర్మకర్తల మండలి ప్రత్యేక ఆహ్వానితులు తన్నీరు ధర్మరాజు, ఆలయ అధికారులు, సిబ్బంది, శివసేవకులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed