- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Ap News: నాలుగు పులి పిల్లల కలకలం.. ఇంకా దొరకని తల్లి జాడ
X
దిశ, వెబ్ డెస్క్: నంద్యాల జిల్లా పెద్దగుమ్మడాపురం ముళ్లపొదల్లో గుర్తించిన నాలుగు పులి పిల్లల తల్లి ఆచూకీ ఇంకా లభ్యం కాలేదు. ఫారెస్ట్ అధికారులు పెద్దపులి కోసం గాలిస్తున్నారు. అది కనిపిస్తే పులిపుల్లలను తల్లి వద్ద వదిలేయని ప్రయత్నాలు చేస్తున్నారు. పులి పిల్లలు కనిపించిన పొదల వద్ద తల్లిని గుర్తించేందుకు ఏర్పాటు చేశారు. కానీ అటువైపు తల్లి పులి రాకపోవడంతో చుట్టు పక్కల సైతం గాలింపు చర్యలు చేపట్టారు.
కాగా ఇవాళ తెల్లవారుజామున ముళ్లపొదల్లో నాలుగు పులి పిల్లలు ఉండటాన్ని స్థానికులు గుర్తించారు. వెంటనే ఫారెస్ట్ అధికారులకు సమాచారం అందించారు. దాంతో పులి పిల్లలను ఫారెస్ట్ అధికారులు వెటర్నరీ ఆస్పత్రికి తరలించారు. అయితే స్థానికులు మాత్రం భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు. పెద్ద పులి ఎప్పుడు ఏం చేస్తుందోనని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
Advertisement
Next Story